ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు 27 దేశాల ప్రజలు గడగడా వణుకుతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొచ్చి పడుతుందోనని భయపడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 3 వేల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ ప్రారంభమైన చైనాలోనే ఈ సంఖ్య 2 వేల 912గా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనాలోని వుహాన్ లో కొత్తగా 202 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ ఇప్పుడప్పుడే తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదని తెలుస్తోంది. మరోవైపు చైనా వెలుపల మిగతా దేశాల్లో మృతుల సంఖ్య 54కు చేరుకుంది. కరోనా వైరస్ దెబ్బకు దక్షిణ కొరియాలో 4 వేల 212 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటు ఉత్తర కొరియాలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నాయన్న కారణంగా ఓ వ్యక్తిని ప్రభుత్వం కాల్చి చంపేసింది. కరోనా వైరస్ మిగతా వారికి వ్యాప్తి చెందకూడదనే భయంతో అలా చేశామని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ఫ్రాన్స్ లో 130 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 27 దేశాల్లో 80 వేల మందికి కోవిడ్-19 వైరస్ సోకింది. దీంతో ఆయా దేశాల్లోని ఆస్పత్రులన్నీ కరోనా వైరస్ బాధితులతో నిండిపోయాయి.


[[{"fid":"182674","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Read Also:భారత్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న చైనా వెల్లుల్లి


మరోవైపు కరోనా వైరస్ ప్రభావం సినిమా, టీవీ నటులపైనా పడింది. ఇప్పటి వరకు లిప్ టు లిప్ కిస్సులతో చెలరేగిపోయిన సినిమా నటులు.. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా వారు లిప్ లాక్ కిస్సులకు దూరంగా ఉంటున్నారు. నటీనటులు ఏదైనా ఫ్లూ  బారిన పడినా.. ముద్దు సన్నివేశాల్లో పాల్గొనొద్దని ఇప్పటికే సింగపూర్‌ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు సూచించింది. మరోవైపు ఇప్పుడు ఇలాంటి ప్రకటనలే ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రకటనలే జారీ చేశాయి. సాధారణంగా ఈ రెండు దేశాల్లో 'పెక్' తో పలకరించుకుంటూ ఉంటారు. 'పెక్' అంటే చెంప చెంప రాసుకుని పలకరించుకోవడం అన్నమాట. ఐతే ఇలా పలకరించుకోవడం వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందన్న కారణంగా ..  కొద్ది రోజులు ఇలాంటి పలకరింపులకు దూరంగా ఉండాలని రెండు దేశాలు ప్రకటించాయి.


[[{"fid":"182675","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]] 
Read Also:కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో ఇదిగో.. !!