North Korea: ఉత్తర కొరియా దూకుడు ప్రదర్శిస్తోంది. సుదూర ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకునే క్రూయిజ్ క్షిపణి పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించింది. అటు ఉత్తర కొరియా నిర్వహించిన పరీక్షలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అగ్రరాజ్యాలకు సవాలు విసురుతున్న ఉత్తర కొరియా(North Korea) మరోసారి దూకుడు ప్రదర్శించింది. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాల తయారీపై అంతర్జాతీయంగా ఆంక్షలున్నా..అత్యాధునిక ఆయుధ సంపత్తిపై దృష్టి సారించింది. క్రూయిజ్ క్షిపణులపై ఆంక్షలు లేకపోవడంతో ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుంది. సుదూర ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకునే క్రూయిజ్ క్షిపణి పరీక్షల్ని విజయవంతంగా పరీక్షించింది. వరుసగా రెండ్రోజులు క్షిపణి పరీక్షల్ని నిర్వహించినట్టు..ఆ దేశ అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఉత్తర కొరియా పరీక్షలపై అటు అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.


ఉత్తర కొరియా నిర్వహించిన క్షిపణి పరీక్షలు(Cruise Missiles Test)15 వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని కచ్చితంగా ఛేదించగలవు. ఉత్తర కొరియాపై శత్రువులు దాడి చేస్తే గుర్తించి సమర్ధవంతంగా తిప్పికొట్టే రక్షణ సామర్ధ్యం ఈ క్షిపణి సొంతం. అమెరికాతో అణు చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొన్నప్పటికీ ఉత్తర కొరియా ఆయుధ సత్తాను ప్రపంచానికి చాటాలనే ఉద్దేశ్యంతో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఈ క్షిపణిని ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక ఆయుధంగా ఉత్తర కొరియా అభివర్ణించడం విశేషం. అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌లలో ఉన్న లక్ష్యాల్ని ఈ క్షిపణి ఛేధించగలదని నిపుణులు చెబుతున్నారు. వ్యూహాత్మక ఆయుధంగా చెప్పడాన్ని బట్టి..కచ్చితంగా అణు వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్ధ్యం కలిగి ఉంటుందనే వాదన విన్పిస్తోంది. అంతటి పరిజ్ఞానం ఉత్తర కొరియాకు ఉందా లేదా అనేది తెలియడం లేదని అమెరికాకు చెందిన రక్షణ నిపుణులు తెలిపారు. అమెరికా, దక్షిణ కొరియా దేశాల్నించి తమకు ముప్పు పొంచి ఉన్నందునే ఆయుధాల్ని సమకూర్చుకుంటున్నట్టు కిమ్ ప్రభుత్వం(Kim Government)ఇప్పటికే స్పష్టం చేసింది. 


ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా నిరంతరం అణ్వాయుధాలపైనే దృష్టి సారించిందని ఆరోపిస్తోంది. ఇలాంటి పరీక్షలు చేయడం అంతర్జాతీయ సమాజానికి ముప్పేనని యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ తెలిపింది.


Also read: Donald Trump on Facebook: ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌పై విమర్శలు సంధించిన ట్రంప్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook