Donald Trump on Facebook: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వర్సెస్ సోషల్ మీడియా వివాదం కొనసాగుతూనే ఉంది. మొన్న ట్విట్టర్‌పై విరుచుకుపడ్డ డోనాల్డ్ ట్రంప్..ఇప్పుడు తాజాగా ఫేస్‌బుక్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను కూడా టార్గెట్ చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం డోనాల్డ్ ట్రంప్(Donald Trump)వర్సెస్ సోషల్ మీడియా ఘర్షణ పెరిగి పెద్దదవుతోంది. ఎన్నికల అనంతరం చెలరేగిన క్యాపిటల్ హిల్స్ హింస ట్రంప్‌ను పూర్తిగా చిక్కుల్లో నెట్టేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల బహిష్కరణకు గురయ్యారు. ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా వేదికలు డోనాల్డ్ ట్రంప్‌పై నిషేధం విధించాయి. అందుకే వీలు దొరికినప్పుడల్లా డోనాల్డ్ ట్రంప్..సోషల్ మీడియాను ఏకిపారేస్తున్నారు.
ఇప్పుడు కొత్తగా ఫేస్‌బుక్ అధినేత మార్గ్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడులకు 20 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఫాక్స్ న్యూస్‌తో జరిగిన ఇంటర్వ్యూలో సోషల్ మీడియా వేదికల్ని తిట్టిపోశారు. ట్విట్టర్‌ను గతంలో విఫలమైన సర్జరీగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఫేస్‌బుక్ మార్క్ జుకర్‌బర్గ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ ..ఫేస్‌బుక్ అధినేతను అంటూ భార్యతో సహా వచ్చేవాడని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను ఓ అవునా అని సమాధానమిచ్చేవాడినన్నారు. వ్యాపారాల కోసం ఎంతదాకా అయినా వెళ్లేవాళ్లని వెటకారం చేశారు. పనుల కోసం వైట్‌హోస్ చుట్టూ తిరిగిన మార్క్ జుకర్‌బర్గ్ లాంటి దిగ్దజాలు చాలామంది ఇప్పుడు చేతగాని దద్దమ్మలుగా మిగిలిపోయారని ధ్వజమెత్తారు. క్యాపిటల్ హిల్స్ హింస(Capital hills violence) సమయంలో ఆ హింసను రెచ్చగొట్టారనే కారణంతో ట్విట్టర్ ట్రంప్‌ను శాశ్వతంగా నిషేధించగా, ఫేస్‌బుక్ (Facebook) 2023 వరకూ నిషేధించింది. ఇన్‌స్టాగ్రామ్ తాత్కాలిక నిషేధం అమలు చేసింది. గూగుల్, ట్విట్టర్,ఫేస్‌బుక్‌లు అమెరికాకు చేసిందేమీలేదని చెప్పారు.
Also read: Saidharam Tej Health Status: సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్, నిలకడగా ఆరోగ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook