Stylish Kim Jong Un: నియంతలకే నియంతగా పేరొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాలీవుడ్ హీరో అవతారమెత్తారు. ఇటీవల ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన సందర్భంగా షూట్ చేసిన ఓ వీడియోలో ఆయన హాలీవుడ్ హీరోలా కనిపించారు. కిమ్ ఎంట్రీ నుంచి చివరి వరకు అచ్చు సినిమాల్లో హీరో ఎలివేషన్ షాట్స్ తరహాలో హైలైట్ చేశారు. ఇందులో బ్లాక్ లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరించిన కిమ్.. క్షిపణి ప్రయోగానికి సంబంధించి సైనికులకు పలు సూచనలు చేస్తూ కనిపించారు. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో సైనికులతో కలిసి కిమ్ విజయోత్సాహంలో మునిగిపోవడం వీడియో చివరలో గమనించవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం 11.52 నిమిషాల నిడివి గల ఈ వీడియోని ఉత్తర కొరియా మీడియా ప్రసారం చేసింది. నిజానికి ఇలాంటి వీడియోలు ఉత్తర కొరియా వాసులకు కొత్త. ఉత్తర కొరియాలో ఉండే ఒకటి, రెండు టీవీ చానెళ్లు ప్రభుత్వ నియంత్రణలోనే నడుస్తాయి. అందులో ఏది ప్రసారం కావాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఎక్కువగా కిమ్ జోంగ్ ఉన్ కుటుంబం, వారి చరిత్ర, వారి గొప్పలు ఇవే ప్రసారం చేస్తుంటారు. 


విదేశాలకు సంబంధించిన వార్తలు కానీ... వీడియోలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసారం చేయరు. ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నా అది రాజధాని ప్యోంగ్యాంగ్‌కే పరిమితం. దానిపై కూడా ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. విదేశీ సినిమాలు చూసేందుకు ఎంతమాత్రం అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరైనా అక్రమంగా హాలీవుడ్ సినిమాలు చూసినా వారికి శిక్షలు తప్పవు. అలాంటి ఉత్తర కొరియాలో హాలీవుడ్ స్టైల్ యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించే వీడియోను అక్కడి మీడియా ప్రసారం చేయడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనకాల కిమ్ జోంగ్ ఉద్దేశం ఏమై ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. 


కిమ్ జోంగ్ ఉన్‌ను హీరోగా చూపించడంతో పాటు ఖండాంతర క్షిపణి ప్రయోగంతో దేశ ప్రతిష్ఠ పెరిగిందని చెప్పేందుకే ఈ వీడియోను రూపొందించి ఉండొచ్చునన్న వాదన వినిపిస్తోంది. ఈ వీడియోని నెటిజన్లు టాప్ గన్, థండర్‌బర్డ్స్, బాండ్ లాంటి హాలీవుడ్ సినిమాలతో పోలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 



Also Read: రైతులతో పెట్టుకుంటే అంతే.. బీజేపీ భరతం పట్టడం ఖాయం.. కేంద్రంపై బాల్క సుమన్ ఫైర్..


INDW vs SAW: టీమిండియాకు షాక్‌.. ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమణ! నోబాల్ ఎంతపని చేసే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook