Balka Suman slams BJP over Paddy Procurement: రైతులతో పెట్టుకున్నోళ్లు ఎవరు బాగుపడినట్లు చరిత్రలో లేదని టీఆర్ఎస్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు రైతులతో పెట్టుకుని ఎటూ కాకుండా పోయాడన్నారు. బీజేపీకి కూడా అదే గతి పడుతుందని... ఆ పార్టీకి రైతులు తలకొరివి పెడుతారని అన్నారు. ఇకనైనా బీజేపీ రాష్ట్ర నాయకులు చిల్లర రాజకీయం పక్కనపెట్టి కేంద్రంతో ధాన్యం కొనుగోలుకు ఒప్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్తే... నూకలు తినండి.. నూకలు అలవాటు చేయండని కేంద్రమంత్రి తెలంగాణ ప్రజలను అవమానించారని బాల్క సుమన్ మండిపడ్డారు. దాన్ని ఖండించాల్సిన బీజేపీరాష్ట్ర నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. పైగా కేంద్రమంత్రి అలా అన్నాడని చెప్పేందుకు... మీ వద్ద వీడియోలు ఉన్నాయా అని బుకాయించడం దుర్మార్గమన్నారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని... రైతాంగం పొట్టకొట్టే ప్రయత్నాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పే బీజేపీ... ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం దేశమంతా ఒకే పాలసీని ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. త్వరలోనే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ తీర్మానాలను ప్రధాని నరేంద్ర మోదీకి పంపిస్తామన్నారు. కేంద్రం దిగి రాకపోతే ఎక్కడికక్కడ రైతులను సమీకరించి పోరాటం ఉధృతం చేస్తామన్నారు.
గతంలో యాసంగిలో వరి వద్దు కేంద్రం ఇబ్బంది పెడుతుందని టీఆర్ఎస్ రైతులకు చెప్పిందని.. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం వరే వేయాలని రైతులను రెచ్చగొట్టారని బాల్క సుమన్ అన్నారు. కేంద్రంతో కొనుగోలు చేయించే బాధ్యత తనదే అని చెప్పిన సంజయ్ తీరా ఇప్పుడు మాట మార్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా పంజాబ్ తరహాలో తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
INDW vs SAW: టీమిండియాకు షాక్.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ! నోబాల్ ఎంతపని చేసే!!
Also Read: CSK vs KKR Turning Point: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అంతా జడేజానే చేశాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook