ఫ్రాన్సులోని పారిస్ కారాగారం నుంచి రిద్వన్ ఫాయిద్(46)అనే గజదొంగ సినీఫక్కీలో పారిపోయాడు. పారిస్‌ కారాగారం నుంచి ఓ నేరస్తుడు హెలికాప్టర్‌లో పారిపోయాడని ఫ్రెంచ్ జైలు అధికారులు ధ్రువీకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. గ్యాంగ్‌స్టర్ రిద్వన్ ఫాయిద్‌ను తప్పించేందుకు అతడి అనుచరులు పథకాన్ని రచించారు. పోలీసుల దృష్టిని మరల్చేందుకు కొంతమంది ఆయుధాలు ధరించి జైలు ఎంట్రన్స్ వద్ద గలాట సృష్టించగా.. అదే సమయంలో జైలు లోపల మరోచోట హెలికాప్టర్ ల్యాండ్ చేసి రిద్వన్‌ను తీసుకెళ్లిపోయారు. రిద్వన్ తనతో పాటు మరో ముగ్గురు ఖైదీలను కూడా తప్పించాడు.


పారిపోయిన ఫెయిడ్ సమీపంలోని గునెస్ ప్రాంతానికి వెళ్లాడని.. హెలికాఫ్టర్ నుంచి దిగి ఓ నల్లటి రేనాల్ట్ కారులో.. ఆతర్వాత కొద్దిసేపటికే మరో వాహనంలోకి మారాడని ఓ టీవీ ఛానల్‌తో పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకోవడానికి తీవ్రంగా గాలిస్తున్నామని అంతర్గత భద్రతాధికారులు వెల్లడించారు.



రిద్వన్ జైలు నుంచి పారిపోవడం ఇది రెండోసారి. గతంలో ఓ దోపిడీ కేసులో పోలీసు అధికారిని చంపడంతో ఫాయిద్‌కు పాతికేళ్లు జైలుశిక్ష పడింది. 2013లో ఉత్తర ఫ్రాన్సులోని జైలులో నలుగురు జైలు సిబ్బందిని మానవ రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకొని అతడు తప్పించుకోగా ఆరువారాల తరువాత పోలీసులు పట్టుకున్నారు.  


రిద్వన్ తప్పించుకున్న జైలుకి ఫెన్సింగ్ లేదని, గాయాలవకుండానే సహచరులతో పాటు అతను తప్పించుకున్నాడని ఫ్రెంచ్ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది.