Yemen Clashes: యెమెన్‌లో ఆగని ఘర్షణలు...200 మంది మృతి!
యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులకు, ప్రభుత్వ దళాలకు మధ్య ఘర్షణలు భీకరంగా జరుగుతున్నాయి. ఈ దాడుల్లో 200 మంది మృతి చెందారు.
Yemen Clashes: యెమెన్‌లో ఘర్షణలు ఆగడం లేదు. ప్రభుత్వ దళాలు, హొతీ తిరుగుబాటుదారుల మధ్య భీకర పోరు(Yemen Clashes) జరుగుతోంది. మరిబ్ రాష్ట్రంలో రెండు రోజులుగా జరిగిన ఘర్షణల్లో(Yemen Clashes) దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇరు పక్షాలకు చెందిన భద్రతా అధికారులు గురువారం తెలిపారు. మృతుల్లో చాలా మంది హౌతీ దళాలకు చెందిన వారే ఉన్నారు.
మరీబ్ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ప్రభుత్వ వర్గాలతో ఇటీవల వారు ఘర్షణకు దిగారు. ఈ మేరకు పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని అధికారులు.. మీడియాకు తెలిపారు. ఈ ఘర్షణల్లో వందలాది మంది గాయపడ్డారని చెప్పారు.
Also read: Tokyo: 'జోకర్' దాడిలో 17 మందికి గాయాలు..అసలేం జరిగిందంటే...
2014లో ఇరాన్ మద్దతుతో హౌతీలు(Houthis) రాజధాని సనా(Sanaa)ను చేజిక్కించుకున్నప్పటి నుంచి యెమెన్‌లో అంతర్యుద్ధం (Yemen Civil War) మొదలైంది. సనా సహా దేశంలోని ఉత్తర భాగాన్ని హౌతీలు హస్తగతం చేసుకున్నారు. దీంతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం తొలుత దక్షిణాది రాష్ట్రాలకు, ఆ తర్వాత సౌదీ అరేబియా(Saudi Arbia)కు తరలిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా మద్దతుతో సౌదీ నేతృత్వంలోని కూటమి 2015 మార్చిలో యుద్ధంలోకి ప్రవేశించింది. హౌతీ స్థావరాలపై అనేక సార్లు వైమానిక దాడులు జరిపింది. ఇరు పక్షాల పరస్పర దాడులతో యెమెన్‌లో తీవ్రమైన మానవతా సంక్షోభం (Yemen Humanitarian Crisis) ఏర్పడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook