World Omicron Alert: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజురోజుకీ ఉధృత రూపం దాలుస్తోంది. ఒమిక్రాన్ సంక్రమణ దేశాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఒమిక్రాన్ సంక్రమణ ఇలా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా కొత్త వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్  ఇప్పటికే  46 దేశాలకు విస్తరించింది. బ్రిటన్, ఇజ్రాయిల్ సహా పలు దేశాల్లో వ్యాపించింది. గత 24 గంటల్లో యూకేలో 663 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని బ్రిటీష్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఇక ఇజ్రాయిల్ దేశంలో కేసుల సంఖ్య 55కు చేరుకోగా, బ్రిటన్‌లో 1898 కేసులకు పెరిగింది. ఒమిక్రాన్ బారినపడ్డవారిలో ఎక్కువశాతం మంది విదేశాల్నించి వచ్చినవారేనని ఇజ్రాయిల్ ప్రభుత్వం(Izrael Government)వెల్లడించింది. ఇజ్రాయిల్‌లో వెలుగుచూసిన 55 కేసుల్లో 36 మంది దక్షిణాఫ్రికా, బ్రిటన్, ఫ్రాన్స్, యూఎస్, యూఏఈ, బెలారస్, హంగేరీ, ఇటలీ, నమీబియా నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. 


కరోనా మహమ్మారి ఉధృతి ఇలాగే కొనసాగితే యూకేలో ఒమిక్రాన్(UK Omicron Cases)కేసులు పది లక్షలకు చేరే అవకాశముంది. దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో సగానికి పైగా ఒమిక్రాన్ కేసులే ఉండటం కలకలం రేపుతోంది. యూకే జనాభాలో 12 ఏళ్లకు పైబడినవారిలో 81 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయింది. అదే సమయంలో 2022 ఏప్రిల్ నాటికి ఒమిక్రాన్ కారణంగా 25 వేల నుంచి 75 వేల వరకూ మరణాలు సంభవించే అవకాశముందని లండన్ స్కూల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్ హెచ్చరిస్తోంది. 


Also read: Dubai: ప్రపంచంలో తొలి కాగిత రహిత ప్రభుత్వంగా దుబాయ్‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి