ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న అంశం కరోనా వైరస్. ఆ మహమ్మారి బారిన పడి 2.42 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 34.5లక్షల మందికి పైగా కరోనా వైరస్ సోకింది. ఒక్క అగ్రరాజ్యం అమెరికాలోనే నిన్న ఒక్కరోజు 868 మంది మరణించగా, ఇప్పటివరకూ మొత్తం 66,620 మంది చనిపోయారని సమాచారం.   మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

212 దేశాల్లో ఇప్పటివరకూ 34,51,000 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, 2,43,000 మందిని వైరస్ బలితీసుకుంది. గడిచిన 24 గంటల్లో 52,90 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,545 మంది వైరస్ బారిన పడి చనిపోవడం గమనార్హం. అత్యధికంగా 11,42,700 కరోనా కేసులతో కరోనా ప్రభావాన్ని అధికంగా చవిచూసిన దేశంగా అమెరికా నిలిచింది. మహేష్ బాబుకు అమ్మగా చేస్తా.. కానీ!: నటి రిప్లై అదుర్స్!


అమెరికా తర్వాత 2,45,550 కేసులతో స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. నిన్న ఒక్కరోజు రికార్డుస్థాయిలో 2,500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్ నిబంధనలు కాస్త సడలించడంతో స్పెయిన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఇటలీలో 2,10,000 కేసులు, యూకేలో 1,82,000 కేసులు, ఫ్రాన్స్ 1,67,000 కరోనా పాజిటివ్ కేసులతో కోవిడ్19 తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్నాయి.  ఎన్నిసార్లు అడిగినా నా వయసు చెబుతా.. మీరు నమ్మరుగా!


అమెరికాలో 66,620 మంది మరణించగా, ఇటలీలో 28,710, యూకే 28,130, స్పెయిన్‌లో 25,100, ఫ్రాన్స్‌లో 24,500 మందిని కరోనా వైరస్ పొట్టన పెట్టుకుంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!