న్యూ ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కుదిపేస్తోన్న కరోనా మహమ్మారికి వాక్సిన్ (coronavirus vaccine) తయారీకి ప్రపంచ ప్రఖ్యాత పరిశోధన సంస్థలు తమ ప్రయత్నాలను ముమ్మరం  చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం విస్తృతంగా అనుసరిస్తున్న ట్రయల్స్ పురోగమిస్తున్నాయని వెల్లడించింది. ఏప్రిల్‌లో ప్రారంభించిన తర్వాత నిపుణులు తదుపరి దశకు వెళ్లగా తరువాతి దశలో వివిధ వయసుల ప్రజలలో వ్యాక్సిన్‌కు రోగనిరోధక ప్రతిస్పందనను అంచనా వేయడానికి 10,260 మంది పెద్ద వయస్కుల వారిని, పిల్లలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయడంతో పాటు వృద్ధులలో, పిల్లలలో రోగనిరోధక వ్యవస్థ ఎంతవరకు స్పందిస్తుందోనని పరిశోధనలు తీవ్రతరమయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  రానా, మిహికా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు
 
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ అధినేత ఆండ్రూ పొలార్డ్ స్పందిస్తూ.. క్లినికల్ అధ్యయనాలు చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాయని, టీకా వృద్ధులలో రోగనిరోధక ప్రతిస్పందనలను ఎంతవరకు ప్రేరేపిస్తుందో అంచనా వేయడానికి విస్తృతమైన రక్షణను అందించగలదా అని పరీక్షించడానికి తాము అధ్యయనాలను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ టీకా కరోనావైరస్ నుండి మానవులపై పరీక్షించడంలో ట్రయల్ వాలంటీర్ల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రారంభ ఫలితాలు సెప్టెంబర్ నాటికి ఆశించవచ్చని, అధ్యయనం మూడవ దశ 18 ఏళ్లు పైబడిన వారిలో టీకా ఎలా పనిచేస్తుందో అంచనా వేయడం ఉంటుందన్నారు.


ఇది కూడా చదవండి: తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
మరోవైపు జెన్నర్ ఇన్స్టిట్యూట్‌లోని వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ మాట్లాడుతూ.. కోవిడ్ -19 వ్యాక్సిన్ ట్రయల్ బృందం రోగనిరోధక శక్తిని అంచనా వేయడానికి, టీకా సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సిద్ధమవుతోందన్నారు. ఫలితాలు విజయవంతమైతే వాక్సిన్ ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి విశ్వవిద్యాలయం బయోఫార్మా మేజర్ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్