coronavirus vaccine: 'కరోనా వైరస్'కు వ్యాక్సిన్.. వచ్చేస్తోంది..!!

'కరోనా వైరస్'.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న  వైరస్ ఇది.  దీని బారి నుంచి తప్పించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ చేయని ప్రయత్నం లేదు.  ఇప్పటికే 'కరోనా వైరస్' బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 7 వేల 138 మందికి చేరుకుంది. దాదాపు లక్షా 67 వేల 511 మంది పాజిటివ్ లక్షణాలతో సతమతమవుతున్నారు.

Last Updated : Mar 17, 2020, 09:48 AM IST
coronavirus vaccine: 'కరోనా వైరస్'కు వ్యాక్సిన్.. వచ్చేస్తోంది..!!

'కరోనా వైరస్'.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న  వైరస్ ఇది.  దీని బారి నుంచి తప్పించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ చేయని ప్రయత్నం లేదు.  ఇప్పటికే 'కరోనా వైరస్' బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 7 వేల 138 మందికి చేరుకుంది. దాదాపు లక్షా 67 వేల 511 మంది పాజిటివ్ లక్షణాలతో సతమతమవుతున్నారు. ప్రాణాలతో ఆస్పత్రులలో పోరాడుతున్నారు. నిన్న ఒక్కరోజే 14 వేల కొత్త కేసులు నమోదయయ్యాంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Read Also: బాలీవుడ్ భామ యోగ 

ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా ఓ తీపి కబురు అందించింది. కరోనా వైరస్ తో పోరాడేందుకు అమెరికాలోని పరిశోధకులు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. దీన్ని మనుషులపై ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయని అమెరికాలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రకటించింది. వ్యాక్సిన్ ట్రయల్స్ ను రికార్డు స్పీడులో తీసుకొచ్చామని తెలిపింది. గతంలో సార్స్, మెర్స్ వైరస్ లకు సంబంధించిన సమాచారం తెలిసిన కారణంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టడం సులువైందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read Also: అన్ని హ్యాండ్ శానిటైజర్‌లు ఒకేలా ఉండవు..!!

Read Also: 'కమలం'పై కేసీఆర్ కన్నెర్ర

మొత్తం నలుగురు రోగులపై కొత్తగా తయారు చేసిన వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేసింది. ఇప్పటికే జంతువులపై తమ పరిశోధనలు సత్ఫలితాలు అందించాయని వ్యాక్సిన్ తయారు చేస్తున్న మాడెర్నా థెరపిటిక్స్ తెలిపింది. కోవిడ్-19 వైరస్ జెనెటిక్ కోడ్ ను తాము చేసిన వ్యాక్సిన్ దెబ్బకొట్టిందని పరిశోధనల్లో తేలిందని వెల్లడించింది. ఐతే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు మరి కొన్ని నెలల సమయం పడుతుందని వివరించింది. 'కరోనా' తగ్గిస్తానంటున్న 'కంత్రీ బాబా'   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News