Pakistan latest: పాకిస్థాన్‌ (Pakistan) ఆపద్ధర్మ ప్రధాని (caretaker Prime Minister)గా బలూచిస్థాన్‌ (Balochistan) సెనేటర్ అన్వర్‌-ఉల్‌-హక్‌ కాకర్‌ ఎంపికయ్యారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా కక్కర్ పేరును ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్ శనివారం జరిగిన సమావేశంలో కాకర్ పేరుపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అంతేకాకుండా కాకర్ నియామకాన్ని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా ఆమోదించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాకర్ ఎవరంటే..?
బలూచిస్థాన్‌ అవామీ పార్టీకి చెందిన అన్వర్‌-ఉల్‌-హక్‌ కాకర్‌(Anwaar-ul-Haq Kakar) ఓ చిన్న ప్రావిన్స్‌కు చెందిన స్థానిక రాజకీయ నేత. దేశంలో ఇతను అంత పాపులర్ కూడా కాదు. అయితే ఈయన గతంలో బలూచిస్థాన్‌ ప్రభుత్వానికి అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బలూచిస్థాన్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై సెనెట్‌లో సభ్యుడిగా అడుగుపెట్టారు. అంతేకాకుండా పార్లమెంటరీ లీడర్‌ స్థాయికి ఎదిగాడు. 


ఎన్నికలు ఎప్పుడంటే?
"ఎవరైతే ప్రధానమంత్రి కావాలో అతను చిన్న ప్రావిన్స్‌కు చెందినవాడై ఉండాలని మేము నిర్ణయించాం.  ఈ క్రమంలోనే బలూచిస్థాన్‌కు చెందిన కాకర్‌ పేరును మా పార్టీ ప్రతిపాదించింది. హబాజ్‌ షరీఫ్‌ కూడా అంగీకరించారు''’’అని ప్రతిపక్ష నేత రియాజ్‌ మాట్లాడారు. ఆగస్టు 13న(ఆదివారం) కాకర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పాక్‌ మీడియా పేర్కొంది.  ఆగస్టు 9న పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం అసెంబ్లీని రద్దు చేసిన 90 రోజుల్లోగా ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అయితే  డీలిమిటేషన్ కారణంగా ఈ ఎలక్షన్ ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


Also Read: Russia: చంద్రయాన్​-3కి పోటీగా 'లూనా​ 25'.. 47 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి దూసుకెళ్లిన రష్యా రాకెట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి