Pakistan Bus Fire: పాకిస్తాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవదహనం! వరదలు వదిలేసినా..
21 dead and 10 injured in Pakistan Bus Fire. పాకిస్తాన్‌లో రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగి 21 మంది సజీవ దహనమయ్యారు. ఏసీ బస్సులో షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.
21 killed and 10 injured in Bus Fire accident in Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగి 21 మంది అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లోని జంషోరో జిల్లా నూరియాబాద్ సమీపంలో బుధవారం అర్థరాత్రి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ బస్సులో షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ ఘోరం జరిగినట్లు సమాచారం తెలుస్తోంది.
గత ఆగస్టులో పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వరదల కారణంగా ముంపు ఏరియా ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. దీంతో వరద బాధితులను కరాచీలోని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో.. వరద బాధితులు అందరూ తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా వరద బాధితులు రైల్, బస్సులలో సొంతూర్లకు వెళుతున్నారు.
ఈ క్రమంలోనే సింధ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన 45 మంది ఏసీ బస్సులో సొంతూళ్లకు బయలుదేరారు. బస్సు జంషోరో జిల్లా నూరియాబాద్ ఎం-9మోటర్ వేపై వెళుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే బస్సు మంటల్లో కాలి బూడిదయ్యింది. బస్సులో ఉన్న వారు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కిటికీలు మూసి ఉండటంతో దట్టమైన పొగ అలుముకుంది. మంటలు కాలి కొందరు చనిపోగా.. దట్టమైన పొగతో ఊపిరాడక మరికొంతమంది ప్రాణాలు విడిచారు.
ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రలును వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిష్టితి విషమంగానే ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. వరదల నుంచి తప్పించుకున్నామని ఆనందించే లోపే అగ్ని ప్రమాదం పాక్ ప్రజల ప్రాణాలను బలితీసుకుంది.
Also Read: Sun Transit in Libra 2022: తులా రాశిలోకి సూర్యుడు.. హార్ట్ పేషెంట్స్ జాగ్రత్త సుమీ!
Also Read: Rayudu Fight: యువ ప్లేయర్‌తో అంబటి రాయుడు వాగ్వాదం.. ఇక మారవా అంటూ ఫాన్స్ ఫైర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook