Food Crisis in Pakistan: పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం మరింత ముదురుతోంది. పెరుగుతున్న ఆర్థిక సంక్షోభంతో పాటే ఆహార సంక్షోభం కూడా పెరుగుతుండటంతో అక్కడి పరిస్థితి రాన్రాను మరింత దారుణంగా తయారైంది. ఆహార పదార్థాల ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటాయి. లీటర్ పాల ధర పాకిస్థాన్ కరెన్సీలో రూ. 210 కి పై మాటే పలుకుతోంది అంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిలో లైవ్ బ్రాయిలర్ కోడి ధర రూ. 500 పలుకుతుండగా.. కిలో చికెన్ ధర రూ. 780 కి విక్రయిస్తున్నారు. ఇక బోన్‌లెస్ మాంసం అయితే కిలోకి ఏకంగా రూ. 1100 వరకు పలుకుతోంది. ఈ ఆర్థిక సంక్షోభం, అప్పుల ఊబి నుంచి బయటపడ్డానికి పాకిస్థాన్ సర్కారు మరోసారి పన్నులు పెంచెందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే, ఒకవేళ పన్నలు పెంచడం అంటూ జరిగితే... ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం సంగతి అటుంచితే.. ఆర్థిక మాంధ్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 


గతేడాది వచ్చిన వరదలు పాకిస్థాన్ ని అతలాకుతలం చేశాయి. 1,739 మంది వరదల కారణంగా మృత్యువాతపడగా... దాదాపు 20 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ వరదలే పాకిస్థాన్ ని ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీశాయంటే.. తాజాగా వెంటాడుతున్న ఆర్థిక సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చింది. పాకిస్థాన్‌కి ఎక్కడ అప్పు పుట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అమెరికా నుంచి అందాల్సిన సాయం కూడా వాయిదా పడింది. దీంతో పాకిస్థాన్ సర్కారు పీకల్లోతు కష్టాల్లో పడింది.


ఇది కూడా చదవండి : Earthquake Death Toll: టర్కీ, సిరియా దేశాల్లో 34 వేలు దాటిన మరణాలు, 50 వేలకు చేరవచ్చని అనుమానం


ఇది కూడా చదవండి : Turkey-Syria Earthquake: 30 వేలకు చేరువలో భూకంప మృతుల సంఖ్య..!


ఇది కూడా చదవండి : Drank Urine to Survive: ఆ 4 రోజులు మూత్రం తాగి బతికాడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK