Bilawal Bhutto on PM Modi: గుజరాత్ కసాయి ప్రధాని మోదీ.. పాక్ విదేశాంగ మంత్రి అభ్యంతకర వ్యాఖ్యలు
India-Pakistan Relations: ప్రధాని మోదీపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ వివాదాస్పద కామెంట్స్ చేశారు. గుజరాత్ కసాయి అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా పాక్ పరువును భారత్ తీయడంతో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
India-Pakistan Relations: ఉగ్రవాదానికి సంబంధించి ప్రతి అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ అవమానాన్ని ఎదుర్కోంటుంది. పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టేందుకు భారత్ కూడా నిరంతరం శ్రమిస్తోంది. యూఎన్‌ఎస్‌సీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మందలించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. ప్రధాని మోదీకి సంబంధించి వివాదాస్పద ప్రకటన చేశారు. ప్రధాని మోదీని గుజరాత్ కసాయి అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
9/11 సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చినందుకు పాకిస్థాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు కానీ కసాయి బతికే ఉన్నాడని భారత్‌కు చెప్పాలనుకుంటున్నానని అన్నారు. అప్పట్లో మోదీకి అమెరికా వీసా నిరాకరించిందని.. ప్రధాని అయ్యాకనే వీసా వచ్చిందన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్‌కు ప్రధానమంత్రి అని విమర్శించారు.
అంతకుముందు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనా, పాకిస్తాన్‌లు అవలంబిస్తున్న ఉగ్రవాదానికి సంబంధించి ద్వంద్వ ప్రమాణాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం సమష్టిగా వ్యవహరించాలని అన్నారు. ప్రపంచం పాకిస్థాన్‌ను ఉగ్రవాదానికి 'కేంద్రం'గా చూస్తోందని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి రెండేళ్ల కాలం గడిచినప్పటికీ.. ఈ ఉగ్రవాదం మూలం ఎక్కడ ఉందో ప్రపంచ సమాజం మరచిపోలేదని ఆయన నొక్కి చెప్పారు.
'మనం రెండున్నరేళ్లుగా కోవిడ్‌తో పోరాడుతున్నామని నాకు తెలుసు. దీని కారణంగా జ్ఞాపకాలు కొంచెం కొంచెం తగ్గిపోయాయి. అయితే ఉగ్రవాదం ఎక్కడ ప్రారంభమవుతుందో.. ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో ప్రపంచం మరచిపోలేదని నేను మీకు భరోసా ఇస్తున్నాను..' అంటూ జైశంకర్ సెటైర్లు వేశారు.
ఉగ్రవాద వ్యతిరేక ఎజెండాను పునరుద్ధరించాలని జైశంకర్ కౌన్సిల్‌ను కోరారు. ఉగ్రవాద ముప్పు మరింత తీవ్రంగా మారిందన్నారు. ఉగ్రవాదులు అవలంబిస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన మాటల దాడి తరువాత పాకిస్థాన్ కలత చెందింది. అందుకే ఆవేశంగా పాక్ విదేశాంగ మంత్రి నుంచి వివాదాస్పద ప్రకటన వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook