Pakistan in Afghan Affairs: తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు ఆందోళన కల్గిస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటులో పాకిస్తాన్ జోక్యం లేదా హస్తముంటుందనే వార్తలు వస్తున్నాయి. చైనా తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్టుగా అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. ఈ పరిణామాలు ఎంత వరకూ నిజం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్ఘనిస్తాన్‌ను(Afghanistan)తాలిబన్లు వశపర్చుకున్న తరువాత ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. ఇండియాకు పక్కలో బల్లెంగా మారిన చైనా, పాకిస్తాన్‌ల జోక్యం ఆ దేశంలో ఉండేట్టే కన్పిస్తోంది. తాలిబన్ల పట్ల ఇప్పటికే ఈ రెండు దేశాలు సానుకూలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. చైనా తన నమ్మినబంటుగా ఉన్న పాకిస్తాన్ సహాయంతో..ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల(Talibans) ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందనేది తాజాగా అంతర్జాతీయ మీడియా వెల్లడించిన సమాచారం. అటు పాకిస్తాన్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్(ISI Chief Kabul Visit) కాబూల్ చేరుకోవడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ఆ దేశంలోని కాందహరీలు, కాబూలీల మద్య తలెత్తిన అంతర్గత సమస్యల్ని పరిష్కరించేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తుందనేది మరో సమచారం. 


ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ (Taliban government)ఏర్పాటుపై కాబూలీలు, హక్కానీలు, కాందహారీలు సముఖంగా లేరు. ఆఫ్ఘన్ ఆర్మీలో హక్కానీలను ప్రవేశపెట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. హక్కానీని తీవ్రవాద గ్రూపుగా, అల్ ఖైదాకు సంబంధించిన సంస్థగా ఇప్పటికే ఐక్యరాజ్యసమితి ప్రకటించిన పరిస్థితి ఉంది. అందుకే పాకిస్తాన్ ప్రయత్నాల పట్ల ఆఫ్ఘన్ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ కాబూల్ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా..తాలిబన్ నాయకత్వానికి సహాయం చేసేందుకు వచ్చినట్టుగా మీడియా చెబుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో చైనా తెరవెనుక పాత్ర పోషిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ సహాయంతో తాలిబన్లకు చైనా రహస్యంగా సహాయం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. కాబూల్ లో అన్ని దేశాలు తమ తమ దౌత్య కార్యాలయాల్ని ముూసివేసినా..చైనా(China) మాత్రం ఇంకా కొనసాగిస్తోంది. అటు తాలిబన్లు కూడా చైనా అందించే ఆర్ధిక సహాయంపై ఆశలు పెట్టుకున్నారు. ఆ దేశంలో విస్తారంగా ఉన్న రాగి, లిథియం గనులపై డ్రాగన్ కన్నేయడమే దీనికి ప్రధాన కారణం. 


Also read: Delhi Terror Attack: ఇండియాలో మరోసారి ఉగ్రదాడులకు అవకాశం, డిల్లీలోని ముఖ్య ప్రాంతాలు టార్గెట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook