Arshad Nadeem with Lashkar terrorist Muhammad Harris Dar: పాకిస్థాన్ కు చెందిన  అర్షద్ నదీమ్ ఇటీవల పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఎంతో కష్టపడ్డాడు. జావెలిన్ త్రో విభాగంలో.. రెండవ ప్రయత్నంలో  92.97 మీటర్ల దూరంలో తన బల్లెన్ని విసిరాడు. అంతేకాకుండా పాక్ కు బంగారం పతకంను అందించాడు. తన దేశం గర్వపడేలా చేశారు. అర్షద్ నదీమ్ జావెలీన్ త్రో కోసం .. ఎంతో కష్టపడ్డాడని తెలుస్తోంది. ఆయన గ్రామస్థులు డబ్బులు జమచేసి మరీ.. అర్హద్ ను ప్రొత్సహించారు. అదే విధంగా అతను కూడా ఎంతో కసిగా జావెలిన్ లో కష్టపడ్డాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈరోజు బంగారు పతకం సాధించాడు. ఆయన పాక్ కు రాగానే ఆ దేశంలో పాటు, గ్రామస్థులు కూడా గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. అతనికి ఆ దేశంలోని పలు పార్టీలు, నేతలు, గ్రామస్థులు అనేక నజరానాలు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అర్షద్ నదీమ్ కు చెందిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. ఇది చాలా మందికి టెన్షన్ పెట్టిస్తుందని చెప్పుకొవచ్చు.


పాకిస్తాన్ ఒలింపిక్ బంగారు పతక విజేత అర్షద్ నదీమ్ యునైటెడ్ స్టేట్స్ చేత ఉగ్రవాదిగా పేర్కొన్న మహ్మాద్ హరీస్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో వైలర్ గా మారింది.దీనిలో నదీమ్.. పారిస్ ఒలింపిక్స్  లో చూపించిన ప్రతిభకు ప్రశంసలు అందుకున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ప్రకారం.. హరీస్.. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) రాజకీయ ఫ్రంట్ అయిన మిలి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్)కి జాయింట్ సెక్రటరీ.


నదీమ్ పాకిస్థాన్‌కు తిరిగి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య సమావేశం జరిగిందని సోషల్ మీడియా వినియోగదారులలో ఒక వర్గం వాదిస్తున్నాయి. మరోవైపు. భద్రతా గ్రిడ్ వర్గాలు మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. వైరల్ అవుతున్న వీడియో.. అనేది పారిస్ ఒలింపిక్స్ కు ముందు భేటీ అయ్మారా.. లేదా.. రీసెంట్ గా కలిశారా.. అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.



మిలి ముస్లిం లీగ్ MML అనేది 166 మందిని చంపిన 2008 ముంబై దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హఫీజ్ సయీద్ చేత తయారు చేయబడిన ఒక సంస్థగా చెప్తుంటారు. 2018లో, యూనైటేడ్ స్టేట్స్.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ ఏడుగురిని "ప్రత్యేకంగా నియమించబడిన గ్లోబల్ టెర్రరిస్టులు"గా పేర్కొంది - MML అధ్యక్షుడు సైఫుల్లా ఖలీద్, ముజమ్మిల్ ఇక్బాల్ సషిమి, హారిస్ ధర్, తబీష్ ఖయ్యూమ్, ఫయాజ్ అహ్మద్, ఫైసల్ నదీమ్, ముహమ్మద్ ఎహ్సాన్. వీరంతా.. LeT తరపున వ్యవహరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.  ఎంఎంఎల్‌ను 2017లో సయీద్ స్థాపించారు. 2018 ఎన్నికల్లో ఎంఎంఎల్ పోటీ చేస్తుందని, అయితే అమెరికా ఆంక్షల తర్వాత అది రాజకీయ పార్టీగా నమోదు కాలేదని చెప్పారు.


 మరోవైపు నదీమ్ ఆగస్టు 8న ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి పాకిస్థానీగా చరిత్ర సృష్టించాడు. 27 ఏళ్ల అతను పురుషుల జావెలిన్ త్రో పోటీలో ఎల్లో మెటల్‌ను గెలుచుకోవడానికి తన రెండవ ప్రయత్నంలో 92.97 మీటర్ల దూరాన్ని తాకాడు. ఫైనల్లో, నదీమ్ 90 మీటర్ల మార్కును రెండుసార్లు అధిగమించి ఒలింపిక్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి అథ్లెట్‌గా నిలిచాడు.


Read more: Venu Swamy: రంగంలోకి దిగిన మహిళ కమిషన్.. చైతు, శోభితల జాతకం వ్యవహారంలో మరో ట్విస్ట్..  


ఆ ఈవెంట్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ కోసం 32 ఏళ్ల సుదీర్ఘ పతక నిరీక్షణను ముగించిన తర్వాత, నదీమ్ ఆదివారం ఉదయం (ఆగస్టు 11) పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్ చున్నులోని తన గ్రామానికి చేరుకున్నాడు. ఇతడికి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter