TG Commission issued notices To Venu swamy: సెలబ్రిటీల జ్యోతిష్యుడు వేణు స్వామి ఇటీవల మరోసారి కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ కు వైఎస్ జగన్ సీఎం అవుతారని ఆయన జాతకం చెప్పారు. కానీ అనూహ్యంగా కూటమి గెలిచి, చంద్రబాబు సీఎంగా అయ్యారు. ఆ తర్వాత నుంచి తాను.. మరేప్పుడు సెలబ్రీటీలు, రాజకీయ నాయకుల వంటి ఫెమస్ పర్సనాలీటీవల జ్యోతిష్యం జోలికిరానని చెప్పారు. కొన్నిరోజుల పాటు ఆయన సైలెంట్ అయిపోయారు. కానీ ఇటీవల నాగచైతన్య, శోభితా ధూలిపాళ్ల ఎంగెజ్ మెంట్ జరిగింది.
ఆ మరుసటి రోజు వేణు స్వామి చైతు, శోభితల వైవాహిక జీవితంలోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరు విడిపోతారని, ఒక మహిళ వల్ల వీరిద్దరి మధ్యలో గొడవలు వస్తాయని కూడా అనేక వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి ఆయనపై రచ్చ మొదలైంది. దీంతో చాలా మంది వేణు స్వామి వ్యాఖ్యల్ని ఖండించారు. ముఖ్యంగా వేణు స్వామిపై.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ లు ఇప్పటికే ఫిర్యాదుల పర్వం మొదలేట్టేశాయి. తాజాగా, వీళ్లు.. తెలంగాణ మహిళ కమిషన్ చైర్ పర్సన్.. నేరెళ్ల శారదను కలిసి.. వేణు స్వామిపై చర్యలు తీసుకొవాలని ఫిర్యాదులు చేశారు. అదే విధంగా.. వేణుస్వామి వ్యాఖ్యల్ని టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ ఛానెల్ పైన కూడా చర్యలు తీసుకొవాలని వినతి పత్రం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో.. మహిళ కమిషన్ దీనిపై సీరియస్ గా స్పందించింది. వేణుస్వామికి సమన్లు జారీ చేసింది. అంతేకాకుండా..వ్యక్తిగతంగా.. ఈ నెల 22 న కమిషన్ ఎదుట హజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదిలా ఉండగా.. వేణు స్వామి చైతు, శోభితల జాతకం తర్వాత ఆయనతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణుసైతం మాట్లాడారు. దీనిపై వేణు స్వామి.. గతంలో తాను.. చైతు, సమంతా విడిపోతారని చెప్పానని, ఇది దానిలో కొనసాగింపుగా వీరి జాతకం చెప్పినట్లు క్లారీటీ చెప్పారు.
Read more: Wife Dragged video: ఘోరం.. భార్య కాళ్లను బైక్ కు కట్టేసీ ఈడ్చుకెళ్లిన దుర్మార్గుడు.. వీడియో వైరల్..
సమన్లపై సీరియస్ అయిన వేణు స్వామి సతీమణి..
మహిళ కమిషన్ వరకు వెళ్లిన కొంత మంది జర్నలిస్టు లపై వేణు స్వామీ సతీమణి వీణా మండిపడ్డారు. గతంలో జర్నలిజం చేసిన వాళ్లు జర్నలిస్టులని, ఇప్పుడు ఒకటి, రెండో ఇంటర్వ్యూలు చేసిన వారు కూడా జర్నలిస్టుగా ఫీలవుతున్నారని అన్నారు. అదే విధంగా కొంత మంది కావాలని ప్రతి విషయాన్ని వివాదాల్లోకి లాగుతున్నారని శ్రీవాణి మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Venu Swamy: రంగంలోకి దిగిన మహిళ కమిషన్.. చైతు, శోభితల జాతకం వ్యవహారంలో మరో ట్విస్ట్..
సీరియస్ గా స్పందించిన మహిళ కమిషన్..
జర్నలిస్టులపై మండిపడ్డ వేణు స్వామి సతీమణి..