Nuclear Weapons: కశ్మీర్ సమస్యకు అణ్వయుధాలకు సంబంధముందా..లేకపోతే కశ్మీర్ సమస్య పరిష్కారమైతే అణ్వాయుధాల అవసరం ఉండదని అనడంలో అర్ధమేంటి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాతో పోలిస్తే..శత్రుదేశాలైన పాకిస్తాన్, చైనా వద్దే ఎక్కువ సంఖ్యలో అణ్వాయుధాలున్నాయని(Nuclear Weapons) ఇటీవలే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ వద్ద 165 అణ్వాయుధాలున్నాయి. కానీ ఇండియాలో ఈ సంఖ్య 156 సిపి నివేదిక వెల్లడించింది. ఈ విషయంపై ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ సందర్బంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం తమను తాను రక్షించుకునేందుకేనని తెలిపారు. కశ్మీర్ సమస్య పరిష్కారమైతే అణ్వాయుధాల అవసరమే ఉండదన్నారు. 


పాకిస్తాన్‌లో అణ్వాయుధాల సంఖ్య పెరుగుతుందా అనే మరో ప్రశ్నకు తెలియదని సమాధానమిచ్చారు. పొరుగుదేశం తమ కంటే ఏడు రెట్లు పెద్దదైనప్పుడు చిన్నదేశం తప్పకుండా జాగ్రత్త పడుతుందని ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan) వెల్లడించారు. తాను అణ్వాయుధాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. కశ్మీర్ అంశాన్ని పరిష్కరించడంలో అమెరికాకు బాధ్యత ఉందని గుర్తు చేశారు. అమెరికా తలచుకుంటే కశ్మీర్ సమస్య పరిష్కారమౌతుందన్నారు. సిమ్లా ఒప్పందం ప్రకారం మూడవ దేశం మధ్య వర్తిత్వం ఉండకూడదని ఇండియా వాదనగా ఉంది.


Also: Coronavirus Threat: కరోనా థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలివీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook