Imran Khan Resign: విదేశీ నిధుల దుర్వినియోగం కేసులో.. ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టినున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదివారం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్​లో ఆదివారం భహిరంగ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించిన ఇమ్రాన్​.. ఆ ర్యాలీలోనే రాజీనామాపై ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఇదే కేసులో ఇమ్రాన్​ ఖాన్​ను సోవారం అరెస్ట్​ చేయొచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాక్​ ప్రధాన మంత్రి కార్యాలయం యూట్యూబ్​ ఛానెల్ పేరు మార్చటం కూడా ఇమ్రాన్​ ఖాన్ రాజీనామాపై వస్తున్న వార్తలకు బలం చేకూర్చుతున్నాయి.


ముందస్తు ఎన్నికలు?


ఇక ఆదివారం జరగనున్న ర్యాలీలో ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల గురించి కూడా ప్రస్తావించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంత వరకు ఆపధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించాలనే నిర్ణయాన్ని ఇమ్రాన్​ ప్రకటించొచ్చని సమాచారం.


ప్రతి పక్షాలతో పాటు వివిధ వర్గాల నుంచి గత కొంత కాలంగా ఇమ్రాన్ ఖాన్​ వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.


ముఖ్యంగా ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తడానికి ఇమ్రాన్​ ఖాన్​ వైఫల్యమే కారణమని ప్రతిపక్షాలు కొంత కాలంగా విమర్శలు చేస్తున్నాయి. ఆ దేశ ఆర్మీ సైతం ఇమ్రాన్​ తీరుపై అసంతృప్తిగా ఉందనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కారణాలన్నింటి నేపథ్యంలో ఇమ్రాన్ గద్దె దిగటం ఖాయమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీనిపై ఇమ్రాన్ రేపు ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి.


Also read: Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై కాలిబర్ క్షిపణి ప్రయోగించిన రష్యా..


Also read: Russia Ukraine War: ఆ తేదీన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆగనుందా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook