Pakistan on Talibans: జమ్ముకశ్మీర్ అంశంలో ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్ మరోసారి వక్రబుద్ధి ప్రదర్శించింది. కశ్మీర్ సమస్య పరిష్కారానికి తాలిబన్లు సహాయం తీసుకుంటామని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో వెల్లడైన ఈ వ్యాఖ్యలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్తాన్(Pakitan)అధికార పార్టీ అధికార ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారడమే కాకుండా ా ఆ దేశాన్ని ఇరుకున పెడుతున్నాయి. తాలిబన్లతో పాకిస్తాన్ కుమ్మక్కైందనే వార్తల్ని నిజం చేస్తున్నాయి. పాకిస్తాన్‌లోని ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ చర్చలో కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో చేతులు కలుపుతామని తాలిబన్లు ప్రకటించారంటూ నీలం ఇర్షాద్ తెలిపారు. ఈయన చేసిన వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఆర్మీకు, తాలిబన్లకు(Talibans) మధ్య సంబంధం తేటతెల్లమైంది. అప్పటికీ న్యూస్ ఛానెల్ ప్రతినిధి..ఈ షోను ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు, భారతీయులు సైతం వీక్షిస్తున్నారు..మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా, మీరేం చెప్పారో మీకు అర్ధమవుతుందా అని ప్రశ్నించారు. అయినా సరే తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ అధికార ప్రతినిధి నీలం ఇర్షాద్ ఇవేమీ పట్టించుకోకుండా..తాలిబన్లు మాకు సహాయం చేస్తారు..ఎందుకంటే అందరూ వారిని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారంటూ సమర్ధించుకున్నాడు. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 


Also read: CIA and Talibans: తాలిబన్లతో అమెరికా సీఐఏ రహస్య సమావేశం..రహస్య ఒప్పందమా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook