Pakistan Woman Rabia slams PM Shehbaz Sharif over skyrocketing prices in Country: పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు నిత్యావసరాల ధరలు కొండెక్కుతున్నాయి. పెట్రోల్, వంట నూనె, గ్యాస్, కరెంట్ బిల్, ఇంటి సరుకుల ధరకు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో సామాన్య ప్రజలు మూడు పూటలా సరిగా తిండి కూడా తినలేని దుస్థితి ఏర్పడింది. డాలర్‌తో పాకిస్తానీ రూపాయి మారకం విలువ బాగా పడిపోయింది. ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు 21 శాతంగా ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం మరియు ద్రవ్యోల్బణం కారణంగా పాక్ ప్రజలకు రోజువారీ జీవనమే కష్టమవుతోంది. పాకిస్థాన్​ వాణిజ్య రాజధానిగా గుర్తింపు ఉన్న కరాచీ పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. కరాచీ నగరంలో మందులు, కిరాణా సామాగ్రి మరియు విద్యుత్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ విషయంపై కన్నీరు పెట్టుకున్న ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పాకిస్థాన్ జర్నలిస్ట్ హమీద్ మీర్ ట్విటర్‌లో షేర్ చేశారు. 


'ది న్యూస్ ఇంటర్నేషనల్' నివేదిక ప్రకారం వీడియోలో మాట్లాడిన మహిళ కరాచీ నివాసి రబియాగా గుర్తించబడింది. ద్రవ్యోల్బణం పెరగడంతో ఆర్థిక సమస్యలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరియు పీఎంఎల్-ఎన్ నాయకుడు మర్యమ్ నవాజ్‌లను దూషిస్తూ మహిళ ఫిర్యాదు చేశారు. పిల్లలకి తిండి పెట్టకుండా నేను వారి జీవితాన్ని నాశనం చేయాలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన తర్వాత తన ఖర్చులను ఎలా నిర్వహించాలో ప్రభుత్వంలోని బాధ్యత గలవారు చెప్పాలని ఆ మహిళ ఉద్వేగానికి లోనైంది. 



'నా జీతం 20 వేలు. ఈ డబ్బుతో నేను ఏమి చేయాలి. 16 వేల ఇంటి అద్దె, భారీ కరెంటు బిల్లు చెల్లించాలా? లేదా నా పిల్లలకు పాలు మరియు మందులు కొనాలా?. నా పిల్లలకు మూడు పూటలా ఆహారం ఇవ్వాలా లేదా చంపాలా. నా ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఫిట్స్‌ ఉంది. ధరలు అనేక రెట్లు పెరగడంతో మందులు కొనలేకపోతున్నా. నా బిడ్డకు మందులు కొనకుండా ఉండగలనా?. ప్రభుత్వం దాదాపు పేద ప్రజలను చంపింది. సర్వశక్తిమంతుడైన అల్లా ప్రశ్నిస్తాడని మీరు నిజంగా భయపడుతున్నారా లేదా?' అని రబియా వెక్కివెక్కి ఏడ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. అందరూ వీడియోను షేర్ చేస్తున్నారు. 


Also Read: బురద నీటిలో స్నానం, యోగా చేస్తూ.. ఎమ్మెల్యే ముందు యువకుడి వినూత్న నిరసన!


Also Read: ఎంఎస్ ధోనీ సరికొత్త అవతారం.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటో! పోలా అదిరిపోలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook