Mud Bath Yoga: బురద నీటిలో స్నానం, యోగా చేస్తూ.. ఎమ్మెల్యే ముందు యువకుడి వినూత్న నిరసన!

Kerala Man showed a protest with bathed in muddy water against roads. కేరళ రహదారిపై గుంతల్లో నిలిచిన బురద నీటిలో ఓ యువకుడు యోగాసనాలు చేస్తూ, స్నానం చేస్తూ నిరసన తెలిపాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 11, 2022, 09:38 AM IST
  • బురద నీటిలో స్నానం, యోగా చేస్తూ
  • ఎమ్మెల్యే ముందు యువకుడి వినూత్న నిరసన
  • వెంటనే బాగు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ
Mud Bath Yoga: బురద నీటిలో స్నానం, యోగా చేస్తూ.. ఎమ్మెల్యే ముందు యువకుడి వినూత్న నిరసన!

Mud Bath and Yoga Protest in Kerala: నిరసన తెలిపేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు దేశ, రాష్ట్ర బంద్ పాటిస్తే.. ఇంకొందరు నిరాహార దీక్ష చేస్తారు. ఇంకొందరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. అయితే తాజాగా ఓ యువకుడు అందరికంటే బిన్నంగా ఆలోచించి.. వినూత్న నిరసన తెలిపాడు. రహదారిపై గుంతల్లో నిలిచిన బురద నీటిలో స్నానం, యోగా చేస్తూ తన నిరసన అధికారులకు వ్యక్తం చేశాడు. ఈ ఘటన కేరళ చోటుచేసుకుంది. 

విషయంలోకి వెళితే... ఇటీవల కాలంలో భారీ స్థాయిలో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేశాయి. అంతమాత్రంగా ఉన్న రోడ్లు పూర్తిగా పాడయిపోయాయి. ముఖ్యంగా మలప్పురం సిటీ ప్రాంతంలోని రోడ్లఉన్న గుంతల కారణంగా సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఎర్నాకులం జిల్లా నెడుంబసేరి వద్ద జాతీయ రహదారిపై ఉన్న గుంతలో పడి 52 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అతడు కిందపడగానే లారీ అతడిపై నుంచి దూసుకెళ్లింది.

అలాంటి పరిస్థితి మలప్పురంలో రాకూడని ఓ యువకుడు గుంతలపై వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రోడ్డుపై నిలిచిన బురద నీటితో యువకుడు ముందుగా తన దుస్తులు ఉతికాడు. బురద నీటిలో ధ్యానం చేశాడు. ఆపై స్నానం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే యూఏ లతీఫ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడిని నిరసనను గమనించి.. అతడితో మాట్లాడారు. నియోజక వర్గంలోని రోడ్లను వెంటనే బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వారం రోజుల్లోగా రోడ్లను బాగు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను కేరళ హైకోర్టు ఆదేశించింది. యువకుడి నిరసన సర్వత్రా చర్చనీయాంశమైంది. 

Also Read: ఎంఎస్ ధోనీ సరికొత్త అవతారం.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటో! పోలా అదిరిపోలా

Also Read: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News