పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి ఊహించని షాక్ తగిలింది. పనామా పేపర్స్ కేసులో ఆయన గతంలో ప్రధానమంత్రి పదవి నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 62(1) ప్రకారం ఆయన ఆ దేశంలో ఎలాంటి ఎన్నికలలోనూ పోటీ చేయకుండా ఉండాలని చెబుతూ.. పాక్ సుప్రీంకోర్టు జీవితకాలం నిషేధం విధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి బహిరంగ సభలు కూడా నిర్వహించరాదని పేర్కొంది. పనామా కేసులో నవాజ్ షరీఫ్ తనపై ఆరోపణలు వస్తున్నా.. తన ఆస్తులకు సంబంధించి ఎలాంటి వివరాలు బహిర్గతం చేయలేదు. ఆయన అలా చేయలేదు కాబట్టి..పాక్ సుప్రీం కోర్టు ఆయనను ప్రధాని పదవిగా అనర్హుడిగా ప్రకటించింది. కోర్టు అలా ప్రకటించగానే షరీఫ్ ఆ పదవి నుండి తప్పుకున్నారు. తాజా తీర్పులో షరీఫ్‌తో పాటు పాకిస్థానీ తెహ్రీక​ఇన్సాఫ్‌ (పీటీఐ) సెక్రటరీ జనరల్‌ జహంగీర్‌ తరీన్‌ పై కూడా వేటు వేసింది కోర్టు


పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని.. చట్టం ముందు అందరూ సమానులే అని లోకానికి చాటడం కోసం ఈ తీర్పును వెలువడిస్తున్నామని పాకిస్తాన్ సుప్రీంకోర్టు  తెలిపింది. అయితే కోర్టు తనను అనర్హుడిగా ప్రకటించినంత మాత్రాన.. ఆయన ప్రజలకు దూరమైనట్లు కాదని.. ఆయన ప్రజలకు సేవ చేయాలని భావిస్తే.. అందుకోసం ఆయన పదవిలోనే ఉండాల్సిన అవసరం లేదని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ తెలిపారు. నవాజ్ షరీఫ్ ఒక వ్యక్తి కాదని.. ఆయన ఒక ఫిలాసఫీ అని ఆయన తెలిపారు.


కోర్టు తీర్పు ప్రకటించిన క్రమంలో షరీఫ్ కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోకుండా పనిచేశానని అన్నారు. కానీ ఆయన జీతం తీసుకున్నారా లేరా అన్న విషయం అప్రస్తుతమని.. చట్టం తన పని తాను తీసుకొని పోతుందని కోర్టు తెలిపింది