పాకిస్థాన్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్‌ ఆరిఫ్‌ అల్వీ(69) ఎన్నికయ్యారు. అధికార ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌(పీటీఐ)’ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధ్యక్ష బరిలో పాకిస్థాన్ అధికారక పార్టీ తెహ్రిక్‌–ఇ–ఇన్సాఫ్‌ నుంచి ఆరిఫ్‌ అల్వీ, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థి నుంచి ఐత్‌జాజ్‌ అహ్సాన్, పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌–ఎన్‌ నుంచి మౌలానా ఫజుల్‌–ఉర్‌–రహ్మాన్‌ దిగారు. మంగళవారం రహస్య బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరగ్గా.. అందులో ఆరిఫ్‌ అల్వీ గెలుపొందారు. నేషనల్‌ అసెంబ్లీ, సెనేట్‌కు సంబంధించిన 430 ఓట్లలో అల్వీకి 212 ఓట్లు, రహ్మాన్‌ 131, అహ్సాన్‌కు 81 ఓట్లు రాగా ఆరు ఓట్లు తిరస్కరించబడ్డాయి.  ప్రస్తుత అధ్యక్షుడి పదవీకాలం ఈనెల 8వ తేదీతో ముగియనుండగా 9వ తేదీన దేశ 13వ అధ్యక్షుడిగా అల్వీ ప్రమాణ స్వీకారం చేస్తారు.


పాకిస్థాన్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్‌ ఆరిఫ్‌ అల్వీ భారతదేశంతో తన తండ్రికి ఉన్న ఆసక్తికరమైన సంబంధాన్ని పంచుకున్నారు. పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ యొక్క వెబ్సైట్ లో అధ్యక్షుడి గురించి పేర్కొన్న యక్క సంక్షిప్త జీవిత చరిత్ర ప్రకారం.. భారత్-పాక్ విడిపోక ముందు భారతదేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఆరిఫ్‌ తండ్రి రెహ్మాన్ అల్వీ (పూర్తి పేరు: డాక్టర్ హబీబ్ ఉర్ రెహ్మాన్ ఇలాహి అల్వీ) దంతవైద్యుడిగా ఉన్నారు. దంతవైద్యుడిగా భారతదేశంలో ప్రాక్టీస్ చేసేవారు. 1947లో పాకిస్థాన్ కు వలస వెళ్లారు. కరాచీకి వలస వచ్చి, సదర్ టౌన్ లో ఒక దంత క్లినిక్ ను ప్రారంభించారు.