Pawan Kalyan: ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ను ఖండించిన జనసేనాని .. బంగ్లా ప్రధాని యూనస్ కు పవన్ వార్నింగ్..
Pawan Kalyan: బంగ్లాదేశ్ లో మరో ఘోరం చోటు చేసుకుంది. ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేయడం అంతర్జాతీయం గా కాక రేపుతోంది. అక్టోబర్ 25న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీ పాల్గొన్న కృష్ణదాస్.. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవ పరిచినట్టు అక్కడి ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ ను ఇప్పటికే భారత ప్రభుత్వం ఖండించగా.. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ చిన్నయ కృష్ణదాస్ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Pawan Kalyan: బంగ్లాదేశ్ లో ఓ పథకం ప్రకారం మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీని వెనక అక్కడ అమెరికా కన్నుసన్నుల్లో కొలువైన మహ్మద్ యూనస్ ప్రభుత్వం హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. మైనారిటీలపై అక్కడ మెజారిటీ వర్గీయులు ముస్లిమ్స్ దాడులకు తెగపడ్డ అక్కడి ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. తాజాగా అక్కడ ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు బ్రహ్మచారి.. ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జెండాను అవమాన పరిచారంటూ .. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన ఓ నేత కంప్లైంట్ ఆధారంగా అక్టోబర్ 30న బంగ్లా పోలీసులు కృష్ణదాస్ తో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఢాకాలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కృష్ణదాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు నిన్న ఛటోగ్రామ్ లోని ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రిట్ ఎదుట హాజరుపరిచయారు. అయితే కృష్ణదాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కాజీ షరీఫుల్ ఇస్లామ్ రిజెక్ట్ చేశారు.
అయితే.. బంగ్లాదేశ్ కు చెందిన ఇస్కాన్ పూజారి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మరోవైపు మరోవైపు కృష్ణదాస్ అరెస్ట్ ను సెక్యులర్ అని చెప్పుకునే ఏ పార్టీ ఖండించక పోవడం విషాదకరం. ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా హిందువులపై దాడులు జరిగిన ఏ దాడులను మన దగ్గరున్న కుహానా సెక్యులర్ పార్టీలు ఏవి ఖండించిన దాఖలాలు లేవు. కానీ బీజేపీ తరువాత జనసేన పార్టీ .. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించింది.
తాజాగా ఇస్కాన్ కృష్ణదాస్ అక్రమ అరెస్ట్ ను జనసేనాని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు ఎంతో మంది భారత జవాన్లు రక్తం ధారబోసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని తన ట్వీట్ లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా అక్కడ తాత్కాలిక ప్రధాని యూనస్ కు హిందువుల పై జరుగుతున్న అక్రమ అరెస్ట్ లతో పాటు దాడులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా పక్క దేశమైన బంగ్లాదేశ్ లో హిందువులపై అక్కడి మెజారిటీ వర్గాలు చేస్తోన్న దాడులను బహిరంగంగా ఖండించి మరోసారి మెజారిటీ హిందువుల మనసులను చూరగొన్నారు పవన్ కళ్యాణ్.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter