పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు ఆ దేశంలో సుప్రీం కోర్టు మరణ శిక్ష విధించింది. దేశద్రోహం కేసులో ఆయన్ను దోషిగా తేల్చింది. 2007లో  ఆనాటి ప్రజలకు ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దెదించి.. ఆర్మీ బలగాలతో కలిసి దేశ అధ్యక్ష పీఠాన్ని ఆయన కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించకుండా అధ్యక్ష హోదాలో కొనసాగారు. ఈ అంశానికి సంబంధించి ఆయన అధ్యక్ష పీఠాన్ని వదిలిన తర్వాత 2013లో దేశ ద్రోహం కేసు నమోదైంది. ఈ కేసును విచారించేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 2014 నుంచి ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన వాదోపవాదాల అనంతరం ఈ కేసులో ఆయన్ను సుప్రీం ధర్మాసనం దోషిగా తేల్చింది. దీంతో ఆయనకు మరణ శిక్షను ఖరారు చేసింది. 


పాకిస్తాన్ అధ్యక్షపీఠం వదిలినప్పటి నుంచి ముషారఫ్ దుబాయ్‌లో నివాసం ఉంటున్నారు. ఐతే ఆయన్ను దుబాయ్ నుంచి తిరిగి రప్పిస్తారా ? లేదా పాకిస్తాన్ పోలీసులు ఆయన్ను దుబాయ్‌లోనే అదుపులోకి తీసుకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.