Petrol Price: షాకింగ్ న్యూస్.. లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ.84 పెంపు! జల్లుమంటున్న సామాన్యుడి గుండె
Petrol Diesel prices in Pakistan. పాకిస్తాన్ ప్రజలకు పెట్రో మంట తగలనుందట. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై ఏకంగా రూ.100ల వరకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.
Petrol, Diesel prices may hike Rs 83 and 119 respectively in Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ప్రజలకు భారీ షాక్ తగలనుందా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. పాక్ ప్రజలకు పెట్రో మంట తగలనుందట. పాకిస్తాన్‌లో ఇంధన ధరలు భారీగా పెరగనున్నాయని సమాచారం తెలుస్తోంది. ఎంతలా అంటే.. పాక్ చరిత్రలోనే తొలిసారిగా లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా రూ.200లకు పైగా చేరనున్నాయట. ఈ ధరలు శనివారం (ఏప్రిల్ 16) నుంచి అమల్లోకి రానున్నాయట.
పాకిస్థాన్ దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోన్న విషయం తెలిసిందే. దేశ ఆర్థిక చక్కబెట్టడం కొత్త ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రజలపై ఇంధన భారాన్ని మోపేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందట. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై ఏకంగా రూ.100ల వరకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా లీటరు పెట్రోల్‌పై రూ. 83.5, డీజిల్‌పై రూ.119 పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై 17 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా.. దీన్ని 70 శాతానికి పెంచాలని ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (ఓజీఆర్ఏ) ప్రతిపాదించిందట. ఈ ధరలపై ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను సంప్రదించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పాకిస్తాన్ ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ధరలు అమలైతే పాక్ సామాన్యుడి గుండె బద్దలవడం ఖాయం. మరి శనివారం ఈ ధరలు అమల్లోకి వస్తాయో లేదో చూడాలి.
పెట్రోల్, డీజిల్‌పైనే కాకుండా ఇతర చమురు ఉత్పత్తుల ధరలు కూడా భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. లైట్ డీజిల్ ధర పైన రూ.77.31, కిరోసిన్ పైన రూ.36.5 పెంచాలని పాక్ ప్రభుత్వం చుస్తోందట. ఇంధన ధరలు భారీగా పెరగడానికి ఓ కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడం అయితే, మరొకటి డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి మారకం విలువ దిగజారడం. ఇప్పటికే శ్రీలంక ప్రజలు పెట్రో భాదలు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో కూడా ఇటీవల ఇంధన ధరలు ప్రతిరోజు పెరిగాయి.
Also Read: TS RTC charges: బస్సు ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్ ఛార్జీలు!
Also Read: పెళ్లిలో బిగ్ ట్విస్ట్... ఆపాలంటూ ప్రియురాలి గొడవ... జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన వరుడి బంధువులు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook