PM Modi To Visit Kuwait:   ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం కువైట్‌కు బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన సందర్భంగా రక్షణ, వాణిజ్యం సహా పలు కీలక రంగాల్లో భారత్‌, గల్ఫ్‌ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు. మోదీ కువైట్ అగ్ర నాయకత్వంతో చర్చలు జరుపుతారు. భారతీయ కార్మిక శిబిరాన్ని సందర్శించిన అనంతరం అక్కడ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గల్ఫ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గల్ఫ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. కువైట్‌తో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, రక్షణ సహకార ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని ప్రధాని పర్యటనకు ఒకరోజు ముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని పర్యటన సందర్భంగా కొన్ని ద్వైపాక్షిక పత్రాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్) అరుణ్ కుమార్ ఛటర్జీ  తెలిపారు. "ప్రధానమంత్రి  చారిత్రాత్మక పర్యటన భారతదేశం-కువైట్ ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని తెరుస్తుంది అని ఆయన అన్నారు.  ఇది ఇప్పటికే ఉన్న ప్రాంతాలలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, భవిష్యత్ సహకారానికి కొత్త ద్వారాలను తెరుస్తుంది. మా భాగస్వామ్య విలువలను బలోపేతం చేస్తుంది. భవిష్యత్తు కోసం మరింత బలమైన భాగస్వామ్యాన్ని నిర్మిస్తుందని ఆయన అన్నారు. 


Also Read: SC On Marriage System: చట్టాలు ఉన్నది భర్తలను బెదిరించడానికి కాదు.. సుప్రీంకోర్టు మొట్టికాయలు  


ఈ పర్యటన భారత్, గల్ఫ్ సహకార మండలి (జిసిసి) మధ్య సంబంధాలను కూడా పెంచుతుందని భావిస్తున్నట్లు ఛటర్జీ చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జిసిసితో భారత్ చర్చలు జరుపుతోందని ఛటర్జీ చెప్పారు. దీనిని పూర్తి చేయడంలో ఇరుపక్షాలు విజయం సాధిస్తాయని మేము ఆశిస్తున్నామని  ఛటర్జీ కువైట్‌లోని కార్మిక శిబిరానికి ఉద్దేశించిన పర్యటనలో, విదేశాలలో ఉన్న భారతీయ కార్మికులందరి సంక్షేమానికి భారత ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మా కార్మికులకు భారత ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేసేందుకు ప్రధాన మంత్రి కార్మిక శిబిరాన్ని సందర్శించడం ఉద్దేశ్యమని తెలిపారు. 


కాగా 1981లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కువైట్లో పర్యటించారు. కువైట్ భారత్ ద్వైపాక్షిక ఒప్పందం 2023-24లో ఏకంగా 10.47 బిలయన్ డాలర్లకు చేరుకుంది. ఈనెల 22న కువైట్ లో ఉన్నత అధికారులతో ప్రధాని మోదీ అధికారిక చర్చలు జరపనున్నారు. కువైట్లో దాదాపు 10లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. 2014లో ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మోదీ పర్యటించిన ఏకైక జీసీసీ సభ్య దేశం కువైట్ కావడం విశేషం. 


Also Read: Gold Rate Today: బంగారం ధర తగ్గుతుంది.. మళ్లీ ఈ అవకాశం రాదేమో.. తులం గోల్డ్ ఎంత తగ్గిందో తెలుసా?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook