SC On Marriage System: మహిళల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాల్లోని కఠినమైన నిబంధనలు వారి భర్తలను శిక్షించడానికి, బెదిరించడానికి లేదా డబ్బు వసూలు చేయడానికి ఉద్దేశించినవి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దంపతుల విడిపోవడానికి సంబంధించిన కేసును విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం ఈ ప్రకటన చేసింది. హిందూ వివాహం అనేది పవిత్రమైన ఆచారమని, అది కుటుంబ పునాదిని బలోపేతం చేయడానికి ఉద్దేశించినదే తప్ప వాణిజ్యపరమైన ఏర్పాటు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
భార్యను క్రూరంగా హింసించారని, వేధింపులకు గురి చేశారని..అత్యాచారం చేశారనే ఆరోపణలన్నింటినీ ప్యాకేజీగా కూర్చి నేర శిక్షాస్మ్రుతిలోని సెక్షన్ల ప్రకారం భర్త, అతని కుటుంబ సభ్యులపై పెడుతున్నారని ధర్మాసనం తెలిపింది. తీవ్ర మనస్పర్థలతో విడిగా నివసిస్తున్న దంపతుల వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం పలు వ్యాఖ్యలను చేసింది. ఈ కేసులో భార్యకు శాశ్వత భరణం కింద రూ. 12కోట్లను నెలలోకా చెల్లించాలని భర్తకు ఆదేశాలు జారీ చేసింది. అతనిపై నమోదు అయిన క్రిమినల్ కేసులను కొట్టివేసింది.
భార్య తరపున గట్టిగా బేరసారాలు చేసేందుకు భర్త, అతని కుటుంబ సభ్యులపై తీవ్రమైన నేరారోపణలు చేయడం కూడా పరిపాటిగా మారిందని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఈ డిమాండ్లలో అత్యధికంగా ఆర్థికపరమైనవే ఉంటున్నాయని ధర్మాసనం తెలిపింది. గ్రుహ హింస ఫిర్యాదులతో రంగంలోకి దిగే పోలీసులు కూడా భర్త తరపు బంధువుల్లో వ్రుద్దులను అనారోగ్యంతో ఉన్నవారిని కూడా అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేస్తున్న ఈ ఘటనలు గొలుసుకట్టు మాదిరిగా ఉంటాయని పేర్కొంది.
తన భర్తకు రూ. 5వేల కోట్ల ఆస్తులున్నాయని అతని తొలి భార్యకు రూ. 500కోట్లు భరణంగా ఇచ్చారు. తనకు కూడా అదే స్థాయిలో చెల్లించాలన్న పిటిషనర్ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఫ్యామిలీ కోర్టు నిర్ణయించిన రూ. 12కోట్ల భరణాన్ని ఖరారు చేసింది. విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భర్తకు వ్యాపారంలో నష్టాలు వచ్చి దివాలా తీస్తే మాజీ భార్య వచ్చి ఆ కష్టాల్లో భాగం పంచుకుంటుందా అని కోర్టు ప్రశ్నించింది.
Also Read:PM Kisan: రైతులకి బిగ్ అలెర్ట్.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook