Japan Earthquake: జపాన్ను వణికించిన భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ...
Powerful earthquake in Japan: జపాన్ భూకంపంతో వణికిపోయింది. బుధవారం (మార్చి 16) రాత్రి ఈశాన్య జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది.
Powerful earthquake in Japan: జపాన్ భూకంపంతో వణికిపోయింది. బుధవారం (మార్చి 16) రాత్రి ఈశాన్య జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. ఫుకుషిమో తీర ప్రాంతంలో భూమి లోపల 60కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప ప్రభావంతో జపాన్ రాజధాని టోక్యో సహా పలు నగరాల్లోని ఇళ్లు భారీ కుదపులకు లోనయ్యాయి. దాదాపు 20 లక్షలకు పైగా ఇళ్లలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. భూకంపం సంభవించిన వెంటనే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
భూకంపం కారణంగా ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటికైతే ఎటువంటి రిపోర్ట్స్ అందలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిద తెలిపారు. భూకంప బాధితులకు అవసరమైన సహాయం అందజేస్తామని.. భూకంపానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటామని వెల్లడించారు.
భూకంపానికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలువురు నెటిజన్లు తమ ప్రాంతాల్లో భూమి కంపించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. 2011 నాటి భయానక అనుభవాలు ప్రస్తుతం జపాన్ ప్రజలను మళ్లీ వెంటాడుతున్నాయి. అప్పట్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 9గా నమోదవగా తాజాగా 7.3గా నమోదైంది. భూకంపంతో దాదాపు 20 లక్షల ఇళ్లల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో ఫుకుషిమో న్లూక్లియర్ ప్లాంట్‌లో కార్యకలాపాలను పరిశీలిస్తున్నట్లు జపాన్ విద్యుత్ కంపెనీ ప్రకటించింది.
Also Read: Vidyaranya Kamlekar's death news: సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య కామ్లేకర్ ఇక లేరు
Also read : Inter Exams 2022: ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు.. ఏ ఎగ్జామ్ ఎప్పుడో తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook