తమ దేశంలో దాదాపు రెండున్నర కోట్ల మందికి కరోనా వైరస్ (Iran CoronaVirus Cases) సోకి ఉండొచ్చునని అధక్షుడు హసన్ రౌహనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు నగరాలు, పట్టణాలలో మళ్లీ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. అతి చిన్న దేశంలో ఇంతమందికి కరోనా సోకిందా అంటూ ప్రపంచ దేశాలు ఇరాన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలల్లో నిజనిజాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నాయి. Covid-19: తెలంగాణలో 1,284 కరోనా కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి శనివారం నాటికి ఇరాన్‌లో అధికారికంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,71,606. అయితే ఆరోగ్యశాఖ తాజా అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయని అధ్యక్షుడు రౌహనీ ప్రకటించారు. దేని ఆధారంగా అధ్యయనం చేశారు, ఆ వివరాలు అధికారిక బులెటిన్‌లో ఎందుకు ప్రకటించడం లేదన్న అంశాలన్ని ఆయన ప్రస్తావించలేదు.  మోడల్ Shweta Mehta Hot Photos వైరల్       


రాబోయే రోజుల్లో మొత్తంగా 30 మిలియన్లు (3 కోట్లు) నుంచి 50 మిలియన్లు (5 కోట్లు) వరకు కరోనా (CoronaVirus In Iran) సోకే ప్రమాదం ఉందన్నారు. 8.18 కోట్ల జనాభా కలిగిన దేశంలో 2.5 కోట్ల మందికి కరోనా సోకిందని ఓసారి, 3 నుంచి 5 కోట్ల మందికి కరోనా సోకే అవకాశముందని సైతం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ ప్రకటించడం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ఇరాన్‌లో కరోనా వ్యాప్తి పరిస్థితికి రౌహనీ మాటలు అద్దం పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..