బ్రిటన్ యువరాజు హ్యారీ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నాడు. ఆ పెళ్లి చేసుకోబోయే ఆవిడ.. యువరాణి అనుకుంటే మీరు పొరబడినట్లే..!  హ్యారీ పెళ్లిచేసుకోబోయేది హాలీవూడ్ నటి మేఘన్ మార్కెల్ ను. ఆమెను అతను గాఢంగా ప్రేమించాడు.. ఆపై పెళ్లి చేసుకొనేందుకు రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని హ్యారీ తండ్రి చార్లెస్ అధికారికంగా మీడియాకు వెల్లడించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవంబర్  మొదటివారంలో హ్యారీ-మేఘన్ డీటేల్స్ నిశ్చితార్థం జరిగింది అని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అధికారిక భవనం కార్లెన్స్ హౌస్ వెల్లడించింది. వీరిద్దరి వివాహము 2018లో జరగనుంది. త్వరలో పెళ్లి తేదీలను ఫిక్స్ చేస్తారు. వివాహనానంతరం హ్యారీ-మేఘన్ డీటేల్స్ కెన్సింగ్టన్ ప్యాలెస్ లోని నాటింగ్హామ్ కాటేజీలో ఉండనున్నారు.


కాగా, హాలీవూడ్ నటి మేఘన్ డీటేల్స్ హ్యారీ కంటే మూడేళ్లు పెద్ద. ఇదివరకే ఈమెకు వివాహం కూడా జరిగింది. ఇంగెల్సన్ తో మూడేళ్లు కాపురం చేసి విడాకులు తీసుకుంది. గతేడాది ఒక సినిమా షూటింగ్ లో హ్యారీ-మేఘన్ డీటేల్స్ మధ్య ప్రేమ చిగురించి.. పెళ్ళికి దారితీసింది. బాలీవూడ్ నటి  ప్రియాంక చోప్రా  ట్విట్టర్ ద్వారా వారిద్దరికీ విషెష్ తెలిపింది.