ఖతార్ దేశంలో జరిగిన ఘటన ఇది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నది 8 మంది భారతీయులు. ఖతార్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌కు గూఢచర్యం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. అందుకే ఆ దేశం ఈ 8 మందికి మరణ శిక్ష విధించింది. న్యాయ సాయం అందించేందుకు సిద్ఘంగా ఉన్నామని భారత విదేశాంగ శాఖ చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖతార్ దేశంలో 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. ఆ దేశంలోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టన్స్ ఈ శిక్షను విధించింది. ఖతార్ దేశంలో పనిచేస్తూ ఇజ్రాయిల్ తరపున గూఢచర్యం చేశారనేది ఆరోపణ. ఈ విషయాన్ని రాయిటర్స్ వెల్లడించింది. 2022 ఆగస్టులో ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ 8 మందిని అరెస్ట్ చేసింది. బెయిల్ కోసం పలుమార్లు అప్లై చేసినా తిరస్కరించిన కోర్టు మరణ శిక్ష ఖరారు చేసింది. ఖతార్ దేశపు సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవల్ని అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లు ఈ 8 మంది మాజీ నేవీ అధికారులు పనిచేస్తున్నారు. 


మరణశిక్ష పడినవారిలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్రకుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్ ఉన్నారు. ఈ ఘటనపై స్పందింంచిన భారత ప్రభుత్వం న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కోర్టు తీర్పు, ఇతర వివరాలు సేకరిస్తున్నామని, సంబంధిత వ్యక్తుల కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ఘటనపై ఇంకా ఇజ్రాయిల్ నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు. 


Also read: India-Canada Conflict: కెనడాకు వీసా సేవల్ని పునరుద్ఱరించిన ఇండియా, ఆ 4 కేటగరీలకే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook