Racist Attack on Indian Women in US: అమెరికాలోని టెక్సాస్‌లో ఇండో-అమెరికన్ మహిళలపై జాత్యహంకార దాడి జరిగింది. మెక్సికన్-అమెరికన్ మహిళ ఒకరు ఇండో-అమెరికన్ మహిళలను దూషిస్తూ దాడికి పాల్పడింది. 'ఎక్కడ చూడూ భారతీయులే కనిపిస్తున్నారు.. మీ దేశం అంత గొప్పదైతే ఇక్కడికెందుకు వచ్చారు..' అంటూ ఆవేశంతో ఊగిపోయి దాడి చేసింది. టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఓ పార్కింగ్ ప్రదేశంలో ఈ దాడి జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన తల్లి, ముగ్గురు స్నేహితులతో కలిసి డిన్నర్ కోసం బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దాడి జరిగిందని సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి పేర్కొన్నారు. 'మీరు అమెరికాను నాశనం చేస్తున్నారు. ఇండియా వెళ్లిపోండి. మీ ఇండియన్స్ అంటేనే ద్వేషం నాకు. ఎక్కడికెళ్లినా మీరే ఉంటున్నారు. బెటర్ లైఫ్ కోసమే అమెరికా వస్తున్నారు. ఇండియాలో లైఫ్ అంత గొప్పగా ఉంటే.. మీరిక్కడ ఎందుకు ఉన్నారు.' అంటూ ఆ మెక్సికన్-అమెరికన్ మహిళ ఇండో-అమెరికన్ మహిళలపై విరుచుకుపడింది.


అక్కడితో ఆగిపోలేదు.. ఇండో-అమెరికన్ మహిళలు మాట్లాడే ఇంగ్లీష్ యాక్సెంట్‌ను కూడా ఆమె అవమానించింది. తాను అమెరికాలోనే పుట్టి పెరిగానని, మీరేమైనా ఇక్కడే పుట్టారా అంటూ ప్రశ్నించింది. ఇండో-అమెరికన్ మహిళలు ఇదంతా వీడియో చిత్రీకరిస్తుండగా వారిపై భౌతిక దాడికి పాల్పడింది. ఈ దాడి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి.. ఆ మహిళ ఎవరో తెలిస్తే చెప్పాలంటూ నెటిజన్లను కోరారు.


ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో ఎట్టకేలకు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను ఎస్మెరాల్డా ఆప్టన్‌గా గుర్తించారు. భౌతిక దాడి, బెదిరింపులకు పాల్పడినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 



Also Read: Trisha Clarity on Politics: రాజకీయాల్లోకి త్రిష.. క్లారిటీ ఇచ్చేసిందిగా!


Also Read: NEET UG Result 2022 : నీట్ పరీక్షా ఫలితాలపై కీలక అప్‌డేట్.. రిజల్ట్స్ తేదీ ప్రకటించిన ఎన్‌టీఏ.. ఆన్సర్ కీ ఎప్పుడంటే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook