Nepal New President Ram Chandra Paudel: నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర పాడెల్ ఎన్నికయ్యారు. పాడెల్ కు 241 మంది ఎంపీలు, 352 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఓటు వేశారు. ఆయన విజయంపై నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవుబా హర్షం వ్యక్తం చేశారు. నేపాల్ అధ్యక్షుడిగా ఎన్నికైన నా స్నేహితుడు రామచంద్ర పాడెల్ కు హృదయపూర్వక అభినందనలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామచంద్ర పాడెల్ 33 వేల 8 వందల 2 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, అతని ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబ్వాంగ్ 15 వేల 5 వందల 18 ఎలక్టోరల్ ఓట్లను సాధించినట్లు నేపాల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫెడరల్ పార్లమెంట్‌లోని 313 మంది సభ్యులు, ప్రావిన్స్ అసెంబ్లీల నుండి 518 మంది సభ్యులు ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. ఖాట్మండులోని న్యూ బనేశ్వర్‌లోని నేపాల్ పార్లమెంట్ భవనంలో ఈ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఫెడరల్ పార్లమెంటేరియన్లు మరియు ప్రావిన్స్ అసెంబ్లీ సభ్యుల కోసం రెండు వేర్వేరు పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. 


ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 884 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 275 మంది ప్రతినిధుల సభ సభ్యులు, 59 మంది నేషనల్ అసెంబ్లీ మరియు 550 మంది ఏడు ప్రావిన్షియల్ అసెంబ్లీలు ఉన్నారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 52,786 ఓట్ల వెయిటేజీ ఉంటుంది. అత్యున్నత పదవిని దక్కించుకోవడానికి అభ్యర్థి చాలా ఓట్లను సాధించాలి. ఫెడరల్ పార్లమెంట్ శాసనకర్త యొక్క ఒక ఓటు వెయిటేజీ 79 మరియు ప్రావిన్స్ అసెంబ్లీ సభ్యునిది 48గా నిర్ణయించడం జరిగినది. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ నేపాలీ కాంగ్రెస్ నాయకుడు రామ్ చంద్ర పౌడెల్‌కు ప్రధాని ప్రచండ నేతృత్వంలోని ఎనిమిది పార్టీల కూటమి మద్దతు ఇస్తుండగా, CPN-UML నుండి ఏకైక అభ్యర్థి సుభాష్ చంద్ర నెంబంగ్‌కు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. 


Also Read: Bangladesh Blast: భారీ పేలుడు.. పదకొండు మృతి.. 100 మందికి తీవ్ర గాయాలు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి