జెనీవా: చూడ్డానికి యాపకాయ సైజులోనే ఉంది కానీ.. ఈ అరుదైన పర్పుల్‌-పింక్‌ కలర్‌ డైమండ్‌‌కి వేలంలో పలికిన ధర ఎంతో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. టెలిఫోన్ బిడ్డింగ్‌ ద్వారా వేలానికి వచ్చిన ఈ పింక్ డైమండ్‌ని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వ్యక్తి 21 మిలియన్‌ డాలర్లు ( భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 1,982,708,140 ) వెచ్చించి మరీ తన సొంతం చేసుకున్నాడు. రష్యాలో లభించిన ఈ పింక్ డైమండ్‌ను స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సోథెబైస్ అనే వేలం కంపెనీ వేలం వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : TSRTC employees salaries: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్


ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్ ( The Spirit of the Rose ) అని పిలుచుకుంటున్న ఈ రత్నం బరువు సుమారు 14.83 క్యారెట్లు. రంగు పరంగా మాత్రమే కాకుండా ఇంకెన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ వజ్రాన్ని 2017లో రష్యన్ వజ్రాల ఉత్పత్తిదారుడు అల్రోసా జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ప్రముఖ జువెలరీ ఎక్స్‌పర్ట్ బెనాయిట్ రెపెల్లిన్ ఈ పింక్ డైమండ్ వేలంలో ( purple-pink diamond auction ) కీలక పాత్ర పోషించాడు. టెలిఫోన్ బిడ్డింగ్‌‌లో 16 మిలియన్స్ డాలర్ల వద్ద ప్రారంభమైన ఈ డైమండ్‌ ధర.. చివరకు 21 మిలియన్ల డాలర్లు పలికింది.


Also read : Coronavirus on packaged meat: మాంసంతో కరోనావైరస్.. చైనాకు కొత్తగా మరో టెన్షన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి