France President Macron: భారత దేశంలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడకలకు  ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మాక్రాన్ వచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు పర్యటనలో భాగంగా రాజస్థాన్ లోని పలు ప్రాంతాలను సందర్శించారు. అదే విధంగా ఈరోజు దేశ ప్రధానితో కలిసి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గోని త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలోనే ఎమ్మాన్యుయల్.. ఇరు దేశాల మధ్య స్నేహ బంధం మరింత బలోపేతం కావాలని కోరుకున్నారు. అదే విధంగా.. ఈరోజు ప్రసంగంలో.. 2030 నాటికి ౩౦ వేల మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్ లో చదివేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు.


 



ఫ్రాన్స్ భాషను భారతీయ విద్యార్థులు మరింత ఈజీగా అర్థం చేసుకునేలా ప్రత్యేక వింగ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. భారత్ రిపబ్లిక్ వేడుకలకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఫ్రాన్స్ దేశానికి ఇది అరుదైన గౌరవమని, థైంక్యూ ఇండియా అంటూ ఎక్స్ వేదికగా రిపబ్లిక్ డే వేడుకలను ఇమ్మాన్యుయల్ షేర్ చేశారు.  


Read Also: Ayodhya: హనీమూన్ కోసం అయోధ్య కు వెళ్దామన్న భర్త.. కొత్త పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా..?
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook