`కరోనా`పై గాయని కరుణ హృదయం
`కరోనా వైరస్`.. ప్రపంచవ్యాప్తంగా మృత్యు క్రీడ ఆడుతోంది. ఈ క్రమంలో అందరూ ఎవరి జాగ్రత్తలు వారు పాటిస్తున్నారు. ఐనా మహమ్మారి లొంగి రావడం లేదు. వేగంగా విస్తరిస్తూ.. ప్రపంచ జనాభాను భయపెడుతోంది.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా మృత్యు క్రీడ ఆడుతోంది. ఈ క్రమంలో అందరూ ఎవరి జాగ్రత్తలు వారు పాటిస్తున్నారు. ఐనా మహమ్మారి లొంగి రావడం లేదు. వేగంగా విస్తరిస్తూ.. ప్రపంచ జనాభాను భయపెడుతోంది.
అన్ని దేశాల్లో వైద్య సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు 24 గంటలు పని చేస్తున్నారు. మరోవైపు పరిశోధకులు కరోనా వైరస్ కు మందు కనుగొనేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. అటు వ్యాక్సిన్ తీసుకురావడంపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ ను త్వరగా నిర్ధారించేందుకు కిట్లను తయారు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో 'కరోనా' కిట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పనులన్నీ జరగాలంటే అత్యధికంగా నిధులు అవసరం. ప్రభుత్వాలు నిధులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నా ..సరిపోవడం లేదు. ఈ క్రమంలో స్వచ్ఛందంగా జనం నుంచి కూడా నిధుల సమీకరణ జరగాల్సి ఉంది.
[[{"fid":"183466","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Read Also: కరోనా కోరలు పీకేదెలా..?
10 నిముషాల్లోనే ''కరోనా వైరస్'' పరీక్ష..!!
ఈ క్రమంలో అమెరికాలోని పాప్ సింగర్ రాబిన్ రిహన్నా ఫెంటీ ముందుకు వచ్చింది. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు తన వంతు సాయంగా 5 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన బామ్మ, తాత పేరుతో ఏర్పాటు చేసిన క్లారా లియోనెల్ ఫౌండేషన్ ద్వారా ఈ సాయం అందించింది. ఆమె సంపద 600 మిలియన్ అమెరికన్ డాలర్లు. అమెరికాలో పాప్ సింగర్ గా పేరుగాంచిన ఆమె ఇప్పటి వరకు 9 గ్రామీ అవార్డులు సంపాదించింది. ప్రసిద్ధ ఫోర్బ్స్ మ్యాగజీన్ లో అత్యంత శక్తిమంత మహిళల జాబితాలో చోటు సంపాదించింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..