జింబాబ్వే అధ్యక్ష పదవికి ముగాంబే రాజీనామా
సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా సేవలందించిన రాబర్ట్ ముగాంబే ఎట్టకేలకు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్లమెంట్ స్పీకర్ జాకబ్ ముడెండాకు అందించారు.
సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా సేవలందించిన రాబర్ట్ ముగాంబే ఎట్టకేలకు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్లమెంట్ స్పీకర్ జాకబ్ ముడెండాకు అందించారు. ఆయన రాజీనామా ఆమోదించడంతో ముగాంబే అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. 1980లో జింబాబ్వేలో బ్రిటీష్ వలసవాదం ముగిసినప్పటి నుంచి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగారు. 93ఏళ్ల ఈ కురువృద్ధుడు జింబాబ్వే దేశాన్ని 37 ఏళ్లు పాలించాడు. గతవారమే ఆయన్ను ఆ దేశ సైన్యం గృహనిర్బంధం గావించి, అధికార పగ్గాలను హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే..! జింబాబ్వేలో ముగాంబే పాలనకు చరమగీతం పాడాలని దేశవ్యాప్తంగా ప్రజలు సామూహిక నిరసన ప్రదర్శనలు చేశారు. ఇక జింబాబ్వే కొత్త శకానికి నాంది పలకనుంది.