Russia Covid: రష్యాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. అక్కడ కొవిడ్ కేసులు, మరణాలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. రష్యా(Russia Corona Cases)లో తాజాగా 39,930 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా వ్యాప్తి మొదలైనప్పట్నుంచి ఇవే అత్యధికం కావడం గమనార్హం.  వైరస్ బారినపడి ప్రాణాలు(Covid Deaths in Russia) కోల్పోతున్నవారి సంఖ్యా భారీగానే ఉంటోంది. నిన్న ఒక్కరోజే రష్యాలో 1069మంది మరణించారు. ఇటీవల 1075 మంది ఒక్కరోజులో ప్రాణాలు కోల్పోవడం అక్కడ రికార్డు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా(Corona Virus) విజృంభణ నేపథ్యంలో కట్టడి చర్యల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Vladimir Putin) ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు(Holidays) ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్‌ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన పుతిన్‌.. ఈ నెల 30 నుంచి నవంబర్‌ 7వరకు సెలవులు ప్రకటించారు. 


పాఠశాలలు, జిమ్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ వేదికలతో పాటు అనేక స్టోర్లను 11 రోజుల పాటు మూసివేయనున్నారు. రెస్టారెంట్లు, కేఫ్‌లకు మాత్రం డెలివరీలకు మాత్రం అనుమతించనున్నారు. ఫుడ్‌ స్టోర్లు, ఫార్మసీలు మాత్రం తెరిచి ఉంచేందుకు అనుమతించనున్నారు. ప్రజలు గుమిగూడకుండా చేపడుతున్న ఈ చర్యలతో కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అక్కడి అధికారులు ఆశిస్తున్నారు. 


Also Read: Vladimir Putin: అయ్యయ్యో వద్దమ్మా...ఆఫీసుకు రావొద్దు..కానీ జీతాలిస్తాం..సుఖీభవ!


రష్యాలో ఇప్పటివరకు 8.2మిలియన్లకు పైగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు(Covid Positive Cases in Russia) నమోదు కాగా.. 2,31,669మంది ప్రాణాలు విడిచారు. కొవిడ్‌తో ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల జాబితాలో రష్యా ఐదో స్థానంలో ఉంది. వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉండటం, తగిన జాగ్రత్తలు పాటించడంలో ప్రజల అలసత్వమే కరోనా వైరస్‌ విలయతాండవానికి కారణమంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 45మిలియన్ల మందికి మాత్రమే పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌(Vaccination) పూర్తయింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook