Travel Ban: కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా రాకపోకలు స్థంబించాయి. విమాన రాకపోకలపై అన్నిదేశాలు విధించుకున్న ఆంక్షలు వైదొలగుతున్నాయి. ఇప్పుడు రష్యా  నిషేధాన్ని ఎత్తివేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా ప్రపంచమంతా ఆగిపోయింది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చాాలా దేశాలు ఇతర దేశాలతో రాకపోకలపై ఆంక్షలు ( Travel Ban ) విధించుకున్నాయి. విమానాల్ని నిషేధించాయి ( Travel Ban ). ఇప్పుడు కరోనా వైరస్ సంక్రమణ తగ్గడం, వ్యాక్సినేషన్ ( Vaccination ) ప్రక్రియ జరుగుతుండటంతో తిరిగి సాదారణ పరిస్థితుల వైపుకు అన్ని దేశాలు మళ్లుతున్నాయి. ఇతర దేశాలతో రాకపోకల్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ దిశగా ఇండియా ఇప్పటికే కొన్ని దేశాలతో షరతులతో కూడిన రాకపోకల్ని అనుమతించింది. ఇప్పుడు రష్యా పలు దేశాలపై విధించిన నిషేధాన్ని( Russia lifts travel Ban ) ఎత్తివేసింది. 


భారత్ ( India ) సహా ఫిన్‌ల్యాండ్ ( Finland ), వియత్నాం ( Vietnam ), ఖతార్ ( Qatar ) దేశాలకు అంతర్జాతీయంగా ప్రయాణాలు కొనసాగించవచ్చని రష్యా ప్రకటించింది. 2020 మార్చ్ 16న విధించిన నిషేధాన్ని దాదాపు పది నెలల అనంతరం ఎత్తివేశారు. రష్యా ( Russia ) లో ఇప్పటి వకూ 36 లక్షల 79 వేల 247 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా..68 వేల 397 మంది మరణించారు. గత 24 గంటల్లో రష్యాలో 19 వేల 290 కొత్త కేసులు నమోదు కాగా..456 మంది మృతి చెందారు. నెమ్మది నెమ్మదిగా మిగిలిన దేశాలు కూాడా నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నాయి. 


Also read: Moderna vaccine update: మోడెర్నా వ్యాక్సిన్‌తో జత కట్టేందుకు టాటా సంస్థ ప్రయత్నాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook