ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య కరోనా వైరస్. ఇదివరకే భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ కరోనా టీకాలు ఇస్తుండగా తాజాగా రష్యా రూపొందించిన వ్యాక్సిన్ స్పుత్నిక్ వి సైతం దేశంలోకి దిగుమతి అవుతుంది. ఈ క్రమంలో రష్యా మరో ప్రకటన చేసింది. రెండు డోసులు తీసుకోవాల్సిన పనిలేదని ఒకే ఒక్క డోసుతో కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని రష్యా దేశం ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకే డోసు వ్యా్క్సిన్ స్పుత్నిక్ లైట్‌ను భారత్‌లో తీసుకొస్తామని రష్యా దౌత్యవేత్త నికోలే కుదషెవ్ ఆదివారం (మే 16) నాడు ప్రకటించారు. ఆ దిశగా రష్యా ఇదివరకే వ్యాక్సిన్లపై ప్రయోగాలు చేస్తుందని చెప్పారు. మరోవైపు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి రెండో బ్యాచ్ హైదరాబాద్‌కు నేడు చేరుకుంది. రష్యా ఏడాదికి 850 మిలియన్ డోసుల స్పుత్నిక్ వి కోవిడ్19 వ్యాక్సిన్(COVID-19 Vaccine) ఉత్పత్తి చేయాలని భావిస్తుందని రష్యా దౌత్యవేత్త నికోలే తెలిపారు. ఈ మేరకు వర్చువల్ సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. కరోనా కష్టకాలంలో భారత్, రష్యా దేశాల మధ్య సహాయ సహకారాలు పెంపొందుతున్నాయి. 


Also Read: Covid-19: ఫేస్ మాస్కులు సుదీర్ఘకాలం వాడితే శరీరంలో Oxygen తగ్గుతుందా, నిజమేంటంటే



ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో రష్యా రూపొందించిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు భారీ డిమాండ్ వచ్చిందన్నారు. 2020లో ద్వితియార్థం నుంచి రష్యా తమ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడం తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్స్, రూపాంతరం చెందిన ప్రమాదకర కరోనా వేరియంట్లపై సైతం తమ వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందని రష్యా నిపుణులు పేర్కొన్నారు. రష్యా వ్యాక్సిన్ అత్యవసర ఆమోదానికి ఏప్రిల్ 12న కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్(Sputnik V Vaccine) ధర ప్రకటించింది. 


Also Read: PM Kisan Samman Nidhi Status: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ, PM Kisan స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి



మన దేశంలో ప్రస్తుతం పంపిణీ అవుతున్న టీకాలు కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కాగా, ఖరీదైన వ్యాక్సిన్‌గా రష్యా వ్యాక్సిన్ నిలిచింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ ధర రూ.995.40గా రెడ్డీస్ లాబోరేటరిస్ ప్రకటించింది.  భారత్‌లో రెడ్డీస్ ల్యాబ్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేయనుంది. 


Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం CoWin యాప్‌లో ఇలా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook