భారత్ దౌత్య పరంగా మరో విజయం సాధించింది. కశ్మీర్ విషయంలో రష్యాను తనమైపు తిప్పుకోగల్గింది. కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయానికి  రష్యా మద్దతు ప్రకటించింది. రాజ్యంగానికి లోబడే భారత్  నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడింది. పాక్ కు ఏమైన అభ్యంతాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కారం వెతుక్కోవాలని సూచన చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంయమనం పాటించాలని సూచన
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రష్యా..  ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించింది. ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దుల్లో నెలకొన్న  ఉద్రిక్తతలు చల్లార్చే చర్యలను ఇరు దేశాలు తీసుకుంటాయని భావిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.


ఏకాకి అవుతున్న పాక్


జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే 370 అధికరణను రద్దు చేసిన మోడీ సర్కార్.. ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్న పాకిస్తాన్... అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టడంలో విఫలమైంది. మతిభ్రమించినట్లుగా వ్యవహరిస్తున్న ఇమ్రాన్ సర్కార్  తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా స్పందింది.