Russia-Ukraine War: ఊహించిన ఆందోళన నిజమైంది. ప్రపంచ దేశాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైపోయింది. బాంబులతో విరుచుకుపడుతోంది రష్యా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న సంక్షోభం ఉద్రిక్తతకు దారితీసింది. రెండు దేశాల మధ్య భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్‌లోని డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌ వేర్పాటువాద ప్రాంతాలను.. రష్యా నేరుగా తన అధీనంలోకి తీసుకుని..ఆ ప్రాంతాలకు స్వతంత్ర హోదా కూడా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తప్పించేందుకు ప్రపంచదేశాలు చాలా ప్రయత్నించాయి. అయితే అన్నీ విఫలమయ్యాయి. ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దంటూ రష్యా అధినేత పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. 


ఊహించిన ఆందోళనే నిజమైంది. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఉక్రెయిన్ దేశంపై రష్యా బాంబులతో విరుచుకుపడిదంది. మిలట్రీ ఆపరేషన్ కూడా ప్రారంభమైందని రష్యా స్వయంగా ప్రకటించింది. ముందుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై దృష్టి సారించింది రష్యా. ఉక్రెయిన్ మిటర్రీ ఆయుధాలు విడిచి పెట్టాలని రష్యా స్పష్టం చేసింది. ఇతరులు జోక్యం చేసుకుంటే ఇదివరకెన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు సమాధానంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పుతిన్ రష్యా ప్రజలకు వివరించారు. ఇప్పటికే ఉక్రెయిన్‌పై నాలుగు ప్రాంతాల్లో రష్యా మిస్సైల్ దాడులు నిర్వహించింది. మరోవైపు డాడ్‌బస్‌లోకి రష్యా మిలట్రీ దూసుకుపోయింది. ముప్పేట దాడితో ఉక్రెయిన్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. అమెరికా హెచ్చరికల్ని రష్యా బేఖాతరు చేస్తూ యుద్ధం ప్రారంభించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 


ఉక్రెయిన్‌లోని పదకొండ నగరాలపై బాంబుల వర్షం కురిపించింది రష్యా. ఆరు నగరాల్లోని ఎయిర్ బేస్‌ను టార్గెట్‌గా చేసుకుంది. మరోవైపు కీవ్ ఎయిర్ పోర్ట్‌ను ఇప్పటికే రష్యా ఆక్రమించేసిందని సమాచారం. కీవ్‌లో రష్యా సైన్యం పాగా వేసిందని తెలుస్తోంది. ప్రతి పది నిమిషాలకు ఓ నగరాన్ని రష్యా ఆక్రమిస్తోందని తెలుస్తోంది. 


Also read: Ukraine Crisis: ఉక్రెయిన్ లో కమ్ముకున్న యుద్ధమేఘాలు.. స్వదేశానికి చేరుకున్న 242 భారతీయులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook