Russia Ukraine War Updates: ఉక్రెయిన్‌ను పూర్తిగా వినాశనం చేస్తే గానీ రష్యా శాంతించేలా కనిపించట్లేదు. రెండు నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న మారణ హోమంలో ఇప్పటికే వేలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు విడిచారు. ఉక్రెయిన్ పట్టణాలు, నగరాలు ఎక్కడికక్కడ శిథిలమైన భవనాలు... పౌరుల మృతదేహాలతో దర్శనమిస్తున్నాయి. అంతేనా... ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల ఆకృత్యాలు మరింత దారుణంగా ఉన్నాయి. మహిళలను చిత్రహింసలకు గురిచేస్తూ వారిపై గ్యాంగ్ రేప్‌లకు పాల్పడి హత్యలు చేస్తున్నారు. తాజాగా రష్యా సైనికుల ఆకృత్యాలకు సంబంధించి మరో కోణం వెలుగుచూసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళల పైనే కాదు పురుషులు, పసి బాలురపై కూడా రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ప్రమీలా పాటెన్ వెల్లడించారు. అత్యాచారాలకు గురైన పురుషులు ఆ విషయాన్ని వెల్లడించేందుకు ముందుకు రావట్లేదన్నారు. మహిళలతో పాటు పురుషులు తమపై అత్యాచారాలను రిపోర్ట్ చేసేందుకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలతో కలిసి తాను పనిచేస్తున్నట్లు వెల్లడించారు.


ఇకనైనా పురుష అత్యాచార బాధితులు ముందుకొచ్చి... తమపై జరుగుతున్న ఆకృత్యాలను బయటపెట్టాలని ప్రమీలా విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో పురుషులపై అత్యాచార ఘటనలు వెలుగుచూశాయని... వాటిపై విచారణ జరుగుతోందని తెలిపారు. అయితే ఇప్పటివరకూ వెలుగుచూసిన ఘటనలు గోరంత మాత్రమేనని పేర్కొన్నారు. 


యుద్ధ కాలంలోనూ హక్కులకు రక్షణ ఉండాలని... మహిళలు, పురుషుల శరీరాలేమీ యుద్ధ క్షేత్రాలు కావని అభిప్రాయపడ్డారు. పురుషులపై అత్యాచార ఘటనలను వాలంటీర్ల సహాయంతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని... అంతర్జాతీయ సమాజం ముందు వారిని దోషులుగా నిలబెడుతామని అన్నారు.


Also Read: Hyderabad MMTS: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి టికెట్ ధరల తగ్గింపు...


Also Read: Also Read: Saroor Nagar Honour Kiling: హైదరాబాద్‌లో పరువు హత్య... నడిరోడ్డుపై గడ్డపారలతో దాడి... యువకుడు అక్కడికక్కడే మృతి...  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.