Vladimir putin: ఇదేం జబర్దస్తీ.. భోజనం, కాఫీ బ్రేక్‌లో శృంగారంలో పాల్గొనండి.. అధ్యక్షుడి విచిత్ర సూచనలు..ఎందుకంటే..?
Russia news: రష్యా దేశఅధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉద్యోగం చేస్తున్న కూడా గ్యాప్ దొరికితే.. శృంగారంలో పాల్గొనాలని కూడా వ్లాదిమిర్ పుతిన్ ప్రజల్ని కోరారు. ఇది ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
vladimir putin urge to have mating during work breaks: రష్య, ఉక్రెయిన్ ల కొంత కాలంగా యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికి కూడా రెండు దేశాలు సైతం ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. ఐక్యరాజ్యసమితో పాటు పలు దేశాలు సైతం.. రెండు దేశాల మధ్య సయోధ్య తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేశాయి. కానీ రష్యా, ఉక్రెయిన్ లు మాత్రం వెనక్కు తగ్గడంలేదని చెప్పుకొవచ్చు. ప్రపంచ దేశాలలో కొన్ని రష్యాకు సపోర్ట్ చేస్తుంటే, మరికొన్ని ఉక్రెయిన్ దేశానికి తమ సహాయం అందిస్తున్నాయి. దీంతో ఇప్పటికి కూడా ఆరెండు దేశాలు ఒకరిపై మరోకరు బాంబుల వర్షం కురిపించుకున్నాయి.
ఇదిలా ఉండగా.. రష్యాలో ఇటీవల కొన్ని లక్షల మంది దేశం వదిలి పెట్టి వెళ్లిపోయారంట. దీంతో అక్కడ కొన్నినెలలుగా విపరీతంగా జననాల రేటు పడిపోయింది. ఇతర దేశాలకు వెళ్లిపోయిన వారిలో అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా, రష్యదేశఅధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. రష్యాలో.. రోజు రోజుకి పడిపోతున్న జనానాల రేటుతో పుతిన్ బెంబెలెత్తిపోయినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆయన .. ఉద్యోగస్తులు, పనులు చేసుకునే వారు.. కాఫీలు, లంచ్ విరామంలో సైతం.. శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనాలని సూచించారు.
కొన్నినెలలుగా.. రష్యాలో..పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. జననాల రేటు 2.1 ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అయితే రష్యాలో మాత్రం ఈ రేటు 1.5కంటే తక్కువకు పడిపోయిందంట.. రష్యా ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీనిపై కీలక ప్రకటన చేశారు. వర్క్ లో.. తీరిక లేదంటూ పిల్లల్ని కనట్లేదని చెప్పడం కరెక్ట్ కాదని, లంచ్ బ్రేక్స్, టీ బ్రేక్స్‌లో శృంగారంలో పాల్గొనాలని సూచించారు.
18 నుంచి 40 ఏళ్ల మహిళలను తమ గర్భధారణ సామర్థ్యాన్ని ఎప్పటి కప్పుడు అంచనా వేసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కూడా పుతిన్ సర్కారు సూచించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు పిల్లల్ని కనేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు.. పార్లమెంట్ లో ఒక ప్రత్యేకమైన విధానం రూపొందించి , అమలు జరిపేలా చేస్తామని ఎంపీ ఒకరువ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా.. యువతీ , యువకులు.. 19 - 20 ఏళ్ల వయసు నుంచే పిల్లల్ని కనడం ప్రారంభించాలని చెప్పారు. అలా చేస్తే.. కనీసం ముగ్గురు, నలుగురు పిల్లలు ఉంటారని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 24 ఏళ్ల లోపున్న యువతులు తొలిసారి పిల్లల్ని కంటే భారీగా నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా.. పొరపాటున కూడా..ఆబార్షన్‌లుచేసుకొవద్దని ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. అదే విధంగా దంపతులు.. డైవర్స్ ఫీజులను కూడా ప్రభుత్వం భారీగా పెంచినట్లు తెలుస్తోంది. అయితే..పుతిన్ కు మాత్రం.. మరియా (39), కాటరీనా (37) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ఏడు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె కూడా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తకథనాలు గతంలో ప్రచురితమయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.