Nepal Plane Crash: మరో ఘోర ప్రమాదం.. ఆకాశంలో గింగిరాలు కొడుతూ కూలిన విమానం.. 18 మంది మృతి?
Saurya Airlines Flight Crashes In Kathmandu: మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. రన్‌వేపై నుంచి జారి ఓ విమానం కుప్పకూలింది. వెంటనే మంటలు చెలరేగడంతో పలువురు మృతి చెందారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?
Nepal Plane Crash: పొరుగు దేశం నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. విమానం కుప్పకూలడంతో భారీగా మంటలు చెలరేగి కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో ఆ విమానంలో దాదాపు 20 మంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగా ఉందని తెలుస్తోంది. ఈ సంఘటనతో నేపాల్‌లో తీవ్ర విషాద వాతావరణం అలుముకుంది.
Also Read: Armaan Kritika Malik: బిగ్‌బాస్ షోలో 'ఆ పని' కానిచ్చేసిన కంటెస్టెంట్లు.. షో బ్యాన్‌కు డిమాండ్
నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌లో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు సాంకేతిక సిబ్బందితో శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బయల్దేరింది. రన్ వే పైనుంచి టేకాఫ్ అయిన ఈ విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. గాల్లో చక్కర్లు కొడుతూ ఎయిర్‌పోర్టు సమీపంలోనే గింగిరాలు తిరుగుతూ కూలిపోయింది. ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు సమాచారం అందింది. అయితే ప్రమాదం నుంచి పైలెట్ సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది.
Also Read: Needle In Body: కడుపులో సూది మరచిన వైద్యులు.. రోగికి రూ.5 లక్షలు బహుమానం
త్రిభువన్ విమానాశ్రయం నుంచి పొఖరాకు విమానం బయల్దేరింది. విమానంలో సాంకేతిక సిబ్బందితో బయల్దేరింది. గింగిరాలు తిరుగుతూ ఆకాశం పైనుంచి విమానం కుప్పకూలింది. ఒక్కసారిగా పడిపోవడంతో విమానంలో మంటలు దరిమిలా చెలరేగి నిమిషాల్లో ఆ విమానం కాలిబూడిదైంది. వెంటనే స్పందించిన భద్రతా దళాలు, విమాన సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.
అయితే విమాన పైలెట్ మనీష్ శక్య (37) ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ తీవ్ర గాయాలపాలవడంతో వెంటనే భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. విమాన ప్రమాదంపై నేపాల్ విమానయాన శాఖ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి