Woman Patient Compensation: నానాటికీ వైద్యులు ఏం ఆలోచించి వైద్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. చికిత్స సమయంలో ఏదో ఆలోచిస్తూ.. నిర్లక్ష్యంగా అందిస్తుండడంతో అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కత్తెరలు, దూదిలు, సిరంజీలు అలాగే మానవ దేహంలో ఉంచి శస్త్ర చికిత్సలు చేస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఇలాగే కడుపులో సర్జికల్ సూది మరచిపోయినందుకు బాధిత రోగికి రూ.5 లక్షల నష్ట పరిహారం అందించింది. అయితే అది కూడా రెండు దశాబ్దాల తర్వాత ఆ నగదు దక్కడం విశేషం. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
Also Read: Necklace At Garbage: చెత్తకుప్పలో వజ్రల హారం.. గంటల్లో కార్మికులు ఏం చేశారో తెలుసా?
కర్ణాటకలోని జయనగర్‌కు చెందిన పద్మావతి స్థానికంగా ఉన్న దీపక్ ఆస్పత్రికి వెళ్లారు. 29 సెప్టెంబర్ 2004లో కంటిలోని హెర్నియాకు సంబంధించిన శస్త్ర చికిత్స పొందారు. అంతేకాకుండా అపెండెక్స్ ఆపరేషన్ కూడా చేసుకున్నారు. కొన్నాళ్లకు మళ్లీ అదే ఆస్పత్రిలో చేరారు. ఆపరేషన్ తర్వాత ఇచ్చిన నొప్పుల నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) ప్రభావంతో నడుం నొప్పి, కడుపు నొప్పి వచ్చింది. మళ్లీ దీపక్ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు.
Also Read: Security Denied Dhoti Farmer: లుంగీ కట్టారని అనుమతించని సెక్యూరిటీ.. మాల్ ఎదుట రైతుల ధర్నా
ఎంతకీ నొప్పులు తగ్గకపోవడంతో 2010లో స్థానికంగా మరో ఆస్పత్రిని ఆశ్రయించారు. ఆమెకు పరీక్షలు నిర్వహించిన అనంతరం దిగ్భ్రాంతికి గురి చేసే విషయాన్ని చెప్పారు. శరీరంలో సర్జరీకి సంబంధించిన సూది ఉందని గుర్తించారు. వెంటనే ఆ సూదిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. అయితే వైద్య చికిత్సలో నిర్లక్ష్యం వహించిన దీపక్ ఆస్పత్రిపై ఆ మహిళ వినియోగదారుల ఫోరంలో అదే ఏడాది ఫిర్యాదు చేశారు.
రెండు దశాబ్దాలుగా ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగింది. వాయిదాల మీద వాయిదాలు కొనసాగుతూ చివరకు కర్ణాటక వినియోగదారుల ఫోరం తాజాగా తీర్పు ఇచ్చింది. ఇది పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యమేనని తేల్చింది. విధుల్లో నిర్లక్ష్యం వహించి రోగిని ఇబ్బందులకు గురి చేసిన ఆస్పత్రి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు దశాబ్దాల తర్వాత తనకు సానుకూలంగా వినియోగదారుల ఫోరం తీర్పునివ్వడంతో బాధితురాలు పద్మావతి ఆనందం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి