SBI Alert: ఎస్‌బీఐ అకౌంట్‌కు PAN కార్డ్ లింక్ చేసుకోకపోతే ఈ ట్రాన్సాక్షన్ చేయలేరు
SBI Customers Do This To Avoid Trouble While Transferring Money: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది. పూర్తి స్థాయిలో ట్రాన్సాక్సన్స్ చేయాలంటే పాన్ కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాలని సూచించింది.
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. నగదు ట్రాన్స్‌ఫర్ లాంటి లావాదేవీల విషయంలో ఖాతాదారులను ఎస్‌బీఐ హెచ్చరించింది. ఇకనుంచి ఏ అంతరాయం లేకుండా అంతర్జాతీయ లావాదేవీలను కొనసాగించాలనుకుంటే, మీ బ్యాంకు ఖాతాతో మీ పాన్(PAN) నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని స్వయంగా ఎస్‌బీఐ తెలిపింది.
బ్యాంకుకు వెళ్లి మీ బ్యాంక్ ఖాతాకు పాన్ కార్డును లింక్ చేసుకోవచ్చు. మీ పాన్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో సైతం అప్‌డేట్ చేసుకోవచ్చు. మీరు ఈ పని కోసం ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదని ఎస్‌బీఐ పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India) ఖాతాతో పాన్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవడం ఆఫ్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు.
Also Read: Xiaomi: భారీ బడ్జెట్‌లో Mi 11 మోడల్స్ లాంఛ్ చేసిన షియోమీ, ధర, ఫీచర్లు ఫూర్తి వివరాలు
దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ(SBI)కి దేశవ్యాప్తంగా 40 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. వీరు అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా లేక విదేశాలలో ఎస్‌బీఐ ఏటీఎం కార్డు వినియోగించాలన్నా కూడా PAN కార్డును బ్యాంకు ఖాతాకు లింక్ చేసుకోవాలని తమ ఖాతాదారులకు గతంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది.
Also Read: EPFO: జాబ్ మానేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్, ఇకనుంచి పాత కంపెనీతో పనిలేదు
ఎస్‌బీఐ అకౌంట్‌కు పాన్ కార్డ్ రిజిస్టర్ చేసే విధానం ఇదే..
1. ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్(https://www.onlinesbi.com/)కు లాగిన్ అవ్వండి, ఈ-సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
2. పాన్ రిజిస్ట్రేషన్ కోసం ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
3. పాస్‌వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి, మీ ఖాతా వివరాలు తెరపై కనిపిస్తాయి.
4. 'Click here to register' ఆప్షన్ క్లిక్ చేయండి
5. ఏ అకౌంట్‌కు పాన్(PAN) లింక్ చేయాలో దానిని క్లిక్ చేయాలి.
6. దీని తరువాత, మీరు పాన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేసి, సబ్మిట్ చేస్తే ఒక పేజీ తెరుచుకుంటుంది.
7. ఆ స్క్రీన్ మీద మీ పేరు, CIF మరియు పాన్ నంబర్ కనిపిస్తాయి. వివరాలు చెక్ చేసి కన్ఫార్మ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
8. కన్ఫార్మ్ క్లిక్ చేశాక.. వెరిఫికేషన్ కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు హై సెక్యూరిటీ కోడ్ అందుతుంది. దాన్ని ఎంటర్ చేసి కన్ఫార్మ్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
9. ఆ తరువాత మీ స్క్రీన్‌పై మీ రిక్వెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి.
10. బ్యాంక్ మీ రిక్వెస్ట్‌ను 7 రోజుల్లో ప్రాసెస్ చేస్తుంది.
Also Read: Credit Cards: క్రెడిట్ కార్డు బిల్లులను EMI రూపంలో చెల్లిస్తే మీకు 5 ప్రయోజనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook